woman over action: రోడ్డు మీద బొక్కా బొర్లా పడిన యువతి... ఈమె తెలివికి అంతా షాక్‌..! వైరల్ అవుతున్న వీడియో..

woman over action: రోడ్డు మీద బొక్కా బొర్లా పడిన యువతి… ఈమె తెలివికి అంతా షాక్‌..! వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Jun 26, 2022 | 8:52 PM

కొందరు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మొదట ఎదుటివాళ్లను ఇరికిస్తుంటారు. ఇదిగో ఈ ఘటనకూడా అలాంటిదే.


కొందరు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మొదట ఎదుటివాళ్లను ఇరికిస్తుంటారు. ఇదిగో ఈ ఘటనకూడా అలాంటిదే. సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు అప్పుడ‌ప్పుడూ ప్రమాదాలు జ‌రుగుతుంటాయి. రెండు బైక్‌లు ఢీకొట్టుకోవ‌డ‌మో లేదా బైక్‌ను వెనుక‌నుంచి కారు గుద్దడ‌మో చూస్తుంటాం. తాజాగా ఓ మ‌హిళ స్కూటీ స్కిడ్ అయి కింద‌ప‌డిపోయింది. త‌న బైక్‌ను వెనుక‌నుంచి ఢీకొట్టడం వ‌ల్లే ప‌డిపోయానంటూ వెనుక వ‌స్తున్న బైక‌ర్‌పై తిట్ల దండ‌కం అందుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.ఈ వీడియోలో ఇద్దరు మ‌హిళ‌లు స్కూటీపై వెళ్తున్నారు. అక‌స్మాత్తుగా బండి స్కిడ్ అయ్యి రోడ్డుపైన పడిపోయారు. డ్రైవింగ్ చేస్తున్న మ‌హిళ లేచి వెనుక వ‌స్తున్న బైక‌ర్‌ను నిందించ‌డం ప్రారంభించింది. అయితే, ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఘటన తర్వాత.. అక్కడి పోలీసులు ఎవరిది తప్పని సీసీ కెమెరా పరిశీలించారు. అప్పుడు వారు షాకింగ్ కు గురయ్యారు. పాపం.. బైకర్‌ కనీసం యువతి దరిదాపుల్లో కూడా లేడు. యువతి మాత్రం ఏదో కావాలని తాకించినట్లు నానా రచ్చ చేసింది. దీనిపై యువతిని అధికారులు మందలించారు. అయితే, అక్కడ సీసీ కెమెరా ఉండటం వల్ల బైకర్‌ బతికిపోయాడు. లేకపోతే.. మనోడి పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించగా.. లక్షల్లో లైక్‌ చేస్తున్నారు. రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Published on: Jun 26, 2022 08:52 PM