AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్యకు ప్రపంచంలోనే ఖరీదైన రామాయణం !! దాని విలువ ఎంతంటే ??

అయోధ్యకు ప్రపంచంలోనే ఖరీదైన రామాయణం !! దాని విలువ ఎంతంటే ??

Phani CH
|

Updated on: Jan 22, 2024 | 6:13 PM

Share

అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట వేడుకకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే వివిధ కానుకలు ఆయోధ్యకు చేరాయి. ఈ క్రమంలోనే రామాలయానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రామాయణ పుస్తకాన్ని మనోజ్ సతీ అనే వ్యక్తి అందజేశాడు. దీని ధర రూ. 1.65 లక్షలు. ఈ పుస్తకంలో రామ మందిరాన్ని పోలి ఉండేలా రూపొందించిన మూడు పెట్టెలు, ఆలయానికి చెందిన మూడు అంతస్తులు చిత్రించబడి ఉన్నాయి. పుస్తకానికి ఉపయోగించిన కాగితం ఫ్రాన్సులో తయారైంది.

అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట వేడుకకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే వివిధ కానుకలు ఆయోధ్యకు చేరాయి. ఈ క్రమంలోనే రామాలయానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రామాయణ పుస్తకాన్ని మనోజ్ సతీ అనే వ్యక్తి అందజేశాడు. దీని ధర రూ. 1.65 లక్షలు. ఈ పుస్తకంలో రామ మందిరాన్ని పోలి ఉండేలా రూపొందించిన మూడు పెట్టెలు, ఆలయానికి చెందిన మూడు అంతస్తులు చిత్రించబడి ఉన్నాయి. పుస్తకానికి ఉపయోగించిన కాగితం ఫ్రాన్సులో తయారైంది. ఈ కాగితానికి ఓ ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే.. యాసిడ్ రహిత కాగితంగా ఇది పేటెంట్ పొందింది. పుస్తక ముఖచిత్రం ఈ పదార్థంతోనే రూపొందించారు. ఇందులో ఉపయోగించిన ఇంక్ జపాన్ నుంచి దిగుమతి అయింది. అంతేగాక దీని రూపకల్పనకు అమెరికన్ వాల్‌నట్ కలప, కుంకుమపువ్వు ఉపయోగించారు. 45 కిలోల బరువున్న ఈ పుస్తకం 400 ఏళ్లకు పైగా ఉంటుందని మనోజ్ సతీ తెలిపారు. ఈ పుస్తకాన్ని నాలుగు తరాలు చదవొచ్చని చెప్పారు. ప్రతి పేజీలో విభిన్నమైన డిజైన్‌ ఉండటం దీని ప్రత్యేకత అన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గోరంత సైజులో బంగారు అయోధ్య రామ మందిరం.. స్వర్ణకారుడి అద్భుత సృష్టి

తడబడి పడబోయిన సీఎం స్టాలిన్‌.. చేయందించిన పీఎం మోదీ

ముగిసిన సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ల దాంపత్య జీవితం

షమీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా ?? సోషల్ మీడియాను కుదిపేస్తున్న పిక్