గోరంత సైజులో బంగారు అయోధ్య రామ మందిరం.. స్వర్ణకారుడి అద్భుత సృష్టి
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేళ దేశం మొత్తం రామనామస్మరణలో మునిగిపోతోంది. బాల రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం కోట్లాది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఏ నోట విన్నా ఆయోధ్య భవ్యరామమందిరం అంశమే వినిపిస్తోంది. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో భక్తులు ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని చాటుకుంటున్నారు. అలా బంగారు భవ్యరామ మందిరాన్ని రూపొందించాడు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ కి చెందిన స్వర్ణకారుడు కపిలవాయి గోపి చారి.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేళ దేశం మొత్తం రామనామస్మరణలో మునిగిపోతోంది. బాల రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం కోట్లాది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఏ నోట విన్నా ఆయోధ్య భవ్యరామమందిరం అంశమే వినిపిస్తోంది. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో భక్తులు ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని చాటుకుంటున్నారు. అలా బంగారు భవ్యరామ మందిరాన్ని రూపొందించాడు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ కి చెందిన స్వర్ణకారుడు కపిలవాయి గోపి చారి. 1.5 సెంమీ ఎత్తు, 1.75 సెంమీ వెడల్పు, 2.75 సెంమీ పొడవుతో భవ్య రామమందిర ఆలయాన్ని 2.730 మిల్లి గ్రాముల బంగారంతో తయారు చేశాడు. గోపి రూపొందించిన గోరంత రామ మందిరంలో 20 గోపురాలు, 108 స్థంబాలు, ప్రత్యేకంగా విల్లును తయారు చేసి తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అంతే కాకుండా ఇంత చిన్న మందిరంలో శ్రీరాముని విగ్రహాన్ని సైతం పొందుపరిచి ఔర అనిపించాడు. సుమారు నెలరోజుల పాటు శ్రమించి భవ్యరామమందిరాన్ని గోరంత సూక్ష్మంగా రూపొందించి తన కళానైపుణ్యంతో సత్తా చాటాడు. ప్రధాని మోదీ వద్ద ఈ కళాఖండాన్ని ప్రదరించాలని కోరుకుంటున్నట్లు గోపి తెలిపాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తడబడి పడబోయిన సీఎం స్టాలిన్.. చేయందించిన పీఎం మోదీ
ముగిసిన సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ల దాంపత్య జీవితం
షమీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా ?? సోషల్ మీడియాను కుదిపేస్తున్న పిక్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

