తడబడి పడబోయిన సీఎం స్టాలిన్.. చేయందించిన పీఎం మోదీ
నడుస్తుండగా తూలి పడబోయిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేయి పట్టుకుని నడిపించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నైలోని ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ వేదికపై తాజాగా జరిగిందీ ఘటన. మోదీ, స్టాలిన్ ఇద్దరూ నడుస్తుండగా, క్రీడామంత్రి ఉదయనిధి వారి వెనకే ఉన్నారు. ఈ క్రమంలో స్టాలిన్ ఒక మెట్టు తప్పిపోయి అడుగువేయడంతో ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి కిందపడబోయారు.
నడుస్తుండగా తూలి పడబోయిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేయి పట్టుకుని నడిపించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నైలోని ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ వేదికపై తాజాగా జరిగిందీ ఘటన. మోదీ, స్టాలిన్ ఇద్దరూ నడుస్తుండగా, క్రీడామంత్రి ఉదయనిధి వారి వెనకే ఉన్నారు. ఈ క్రమంలో స్టాలిన్ ఒక మెట్టు తప్పిపోయి అడుగువేయడంతో ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి కిందపడబోయారు. పక్కనే ఉన్న మోదీ వెంటనే స్టాలిన్ ఎడమ చేయి పట్టుకుని కిందపడకుండా సాయం అందించారు. ఆ ఇద్దరూ కలిసి స్టేజిపైకి చేరుకున్నారు. ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మాట్లాడుతూ.. 2036 ఒలింపిక్ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. క్రీడాకారులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు, దేశాన్ని గ్లోబల్ స్పోర్ట్స్ ఎకోసిస్టంకు కేంద్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. తమిళనాడును క్రీడలకు దేశ రాజధానిగా తీర్చిదిద్దుతామని అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముగిసిన సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ల దాంపత్య జీవితం
షమీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా ?? సోషల్ మీడియాను కుదిపేస్తున్న పిక్
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

