అతిపెద్ద వజ్రాల భవనం చూశారా ?? వీడియో ఇదిగో

అతిపెద్ద వజ్రాల భవనం చూశారా ?? వీడియో ఇదిగో

Phani CH

|

Updated on: Dec 20, 2023 | 9:58 AM

గుజరాత్‌లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద కార్యాలయ సముదాయం‘సూరత్ డైమండ్ బోర్స్’. ఈ భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్‌ 17న ప్రారంభించనున్నారు. డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ డ్రీమ్ సిటీలో నిర్మితమైన ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది. దాదాపు 3,500 కోట్ల రూపాయల వ్యయంతో 35 ఎకరాల స్థలంలో దీన్ని నిర్మించారు.

గుజరాత్‌లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద కార్యాలయ సముదాయం‘సూరత్ డైమండ్ బోర్స్’. ఈ భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్‌ 17న ప్రారంభించనున్నారు. డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ డ్రీమ్ సిటీలో నిర్మితమైన ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది. దాదాపు 3,500 కోట్ల రూపాయల వ్యయంతో 35 ఎకరాల స్థలంలో దీన్ని నిర్మించారు. ఈ డైమండ్‌ బోర్స్‌ 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 9 గ్రౌండ్ టవర్లు, 15 అంతస్తుల్లో దీని నిర్మాణం చేపట్టారు. 300 చదరపు అడుగుల నుండి 1 లక్ష చదరపు అడుగుల వరకు కార్యాలయ స్థలాలు ఉన్నాయి. డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్‌ కనెక్టడ్ భవనం. ఈ బిల్డింగ్‌లో సుమారు 4,700 కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం 130 కార్యాలయాలు ఇప్పటికే వాడుకలో ఉన్నాయి. ఈ భవనం పెంటగాన్ కంటే పెద్దదని చెబుతున్నారు. ఇప్పుడు ఈ భవనం వజ్రాల వ్యాపారానిక ప్రపంచ కేంద్రంగా మారనుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

HanuMan: దిమ్మతిరిగేలా చేస్తున్న హనుమాన్ ట్రైలర్

Kotabommali PS: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోటబొమ్మాళి…

క్లియర్ కట్ విన్నర్ ప్రభాస్‌ !! పాపం కదా.. షారుఖ్‌ !!

Animal: ఇండియన్ బాక్సాఫీస్‌ దగ్గర నయా రికార్డ్‌ క్రియేట్ చేసిన యానిమల్

Anupama Parameswaran: మేకర్స్‌కు షాకిచ్చిన అనుపమ.. ఏమాత్రం తగ్గట్లేగా..

Published on: Dec 20, 2023 09:57 AM