పంటలు కాపాడుకోవడంలో ట్రెండ్ మార్చిన రైతులు
సాధారణంగా పక్షులు, జంతువులనుంచి పంటలను కాపాడుకోడానికి రైతులు పొలాల్లో దిష్టిబొమ్మలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే, అవి బొమ్మలేనని, అవి తమనేమీ చేయలేవని గ్రహించిన పక్షులు, జంతువులు తమ పని తాము చేసుకుపోతున్నాయి. దాంతో విసుగు చెందిన ఓ యువ రైతు వినూత్నంగా ఆలోచించాడు. తన పంటను కాపాడుకోడానికి పంటచేలో రాజకీయ నేతల పెద్ద పెద్ద కటౌట్‌లు, అందమైన హీరోయిన్ల ఫోటో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు.
సాధారణంగా పక్షులు, జంతువులనుంచి పంటలను కాపాడుకోడానికి రైతులు పొలాల్లో దిష్టిబొమ్మలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే, అవి బొమ్మలేనని, అవి తమనేమీ చేయలేవని గ్రహించిన పక్షులు, జంతువులు తమ పని తాము చేసుకుపోతున్నాయి. దాంతో విసుగు చెందిన ఓ యువ రైతు వినూత్నంగా ఆలోచించాడు. తన పంటను కాపాడుకోడానికి పంటచేలో రాజకీయ నేతల పెద్ద పెద్ద కటౌట్‌లు, అందమైన హీరోయిన్ల ఫోటో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. దాంతో నిజంగానే మనుషులు అక్కడున్నారని భావించిన పక్షులు దరిదాపులకు రాకుండా పారిపోతున్నాయి. ఈ విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీదితండా కు చెందిన ఓ యువరైతు తన పంటచేలో పక్షులు, కోతులు పంటలు నాశనం చేస్తుండటంతో..దిష్టి బొమ్మలు ఏర్పాటు చేశాడు. అయినా ఫలితంల లేకపోవడంతో అతనికి ఓ ఐడియా వచ్చింది. వెంటనే BRS పార్టీ నేతల కటౌట్‌ను పంట చేనులో ఏర్పాటు చేశాడు. అతన్ని చూసి మరో రైతు బికినీ లో ఉన్న హీరోయిన్ ఫోటో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. వాటిని చూసి అక్కడ మనుషులే ఉన్నారనుకొని భావించిన కోతులు దూరంగా పారిపోతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చోరీ చేసి, చెరువు మధ్యలో కూర్చున్న దొంగ.. ఎందుకంటే ??
రూ.12తో పాపం కడిగేసుకోవచ్చు !! సర్టిఫికెట్టూ తీసుకోవచ్చు !!
120 అడుగులు కటౌట్… మొదలైన మాస్ మేనియా