Actress Vaishnavi Dhanraj: నన్ను వేధిస్తున్నారు సాయం చేయండి.. పోలీసులను ఆశ్రయించిన నటి.
సాధారణంగా ఎవరికైనా బయటివారినుంచి వేధింపులు ఎదురైతే కుటుంబం అండగా నిలుస్తుంది. కానీ ఇక్కడ ఓ నటి పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. ఆమె కుటుంబ సభ్యులే ఆమెపై దాడి చేస్తున్నారని, తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ ప్రముఖ నటి. సీఐడీ సిరీస్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన నటి వైష్ణవి ధన్‌రాజ్ తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది..
సాధారణంగా ఎవరికైనా బయటివారినుంచి వేధింపులు ఎదురైతే కుటుంబం అండగా నిలుస్తుంది. కానీ ఇక్కడ ఓ నటి పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. ఆమె కుటుంబ సభ్యులే ఆమెపై దాడి చేస్తున్నారని, తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ ప్రముఖ నటి. సీఐడీ సిరీస్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన నటి వైష్ణవి ధన్‌రాజ్ తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుటుంబసభ్యులు తనపై శారీరక హింసకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్లో ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది. నాకు సాయం కావాలి.. నేను కాశీమీరా పోలీస్ స్టేషన్‌లో ఉన్నాను. నా కుటుంబమే నాపై వేధింపులకు పాల్పడింది. నా పట్ల దారుణంగా వ్యవహరించారు. న్యూస్ ఛానల్స్‌తో పాటు సినీ ఇండస్ట్రీ వారు సాయం చేయండి అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. వీడియోలో తన నోరు, కుడిచేయి మణికట్టుపై ఉన్న గాయాలను కూడా ఆమె చూపించింది. వైష్ణవి తన కుటుంబసభ్యులపై నాన్ కాగ్నిజబుల్ ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, వైష్ణవి 2016లో నటుడు నితిన్ షెరావత్‌ను పెళ్లి చేసుకుని ఆ తరువాత కొన్ని రోజులకే విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

