Viral Video: కల్లు గీస్తూ.. తాటి చెట్టుపై ఇరుక్కుపోయిన గీత కార్మికుడు.. వీడియో వైరల్.

Viral Video: కల్లు గీస్తూ.. తాటి చెట్టుపై ఇరుక్కుపోయిన గీత కార్మికుడు.. వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Jul 12, 2023 | 6:52 PM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ గీతకార్మికుడు తృటిలో ప్రాణాలతో బటయపడ్డాడు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన ఆరేటి రాములు గౌడ్‌ కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజూలాగే ఈరోజు కూడా కల్లు గీసేందుకు వెళ్లాడు. తాటి చెట్టు ఎక్కి కల్లుగీస్తున్న సమయంలో పట్టుతప్పి జారిపోయాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ గీతకార్మికుడు తృటిలో ప్రాణాలతో బటయపడ్డాడు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన ఆరేటి రాములు గౌడ్‌ కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజూలాగే ఈరోజు కూడా కల్లు గీసేందుకు వెళ్లాడు. తాటి చెట్టు ఎక్కి కల్లుగీస్తున్న సమయంలో పట్టుతప్పి జారిపోయాడు. ఈ క్రమంలో రాములు చెట్టుకు వేళాడుతూ ఉండిపోయాడు. అంత ఎత్తున తలక్రిందులుగా వేలాడుతూ సాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో పరశురాములు అనే మరోవ్యక్తి అటుగా కల్లుగీసేందుకు వచ్చాడు. తోటి గీత కార్మికుడు చెట్టుపై నిస్సహాయంగా వేళాడుతుండటం చూసి గబగబా చెట్టుపైకి ఎక్కాడు. ప్రాణాలకు తెగించి చెట్టుపై వేళాడుతున్న వ్యక్తిని కాపాడి కిందకు దించాడు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పరశురాములు చేసినపనికి గ్రామసర్పంచ్‌, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...