Viral: సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..

సబ్బుపై కాలేసీ భవనం పైనుంచి ఓ మహిళ జారిపడ్డ అసాధారణ ఘటన బెంగళూరులో తాజాగా చోటుచేసుకుంది. ఈ ఘటనలో బాధితురాలు తీవ్ర గాయాలపాలైంది. స్థానికుల కథనం ప్రకారం, రుబయా అనే 24 ఏళ్ల మహిళ కనకనగర్‌లో ఉంటోంది. భనవంపై గిన్నెలు తోముతున్న సమయంలో సబ్బుపై కాలు పడి ఆమె జారింది. టెర్రస్ గోడ చిన్నగా ఉండటంతో ఆమె భవనం పైనుంచి కింద పడిపోయింది.

Viral: సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..

|

Updated on: Jun 26, 2024 | 5:39 PM

సబ్బుపై కాలేసీ భవనం పైనుంచి ఓ మహిళ జారిపడ్డ అసాధారణ ఘటన బెంగళూరులో తాజాగా చోటుచేసుకుంది. ఈ ఘటనలో బాధితురాలు తీవ్ర గాయాలపాలైంది. స్థానికుల కథనం ప్రకారం, రుబయా అనే 24 ఏళ్ల మహిళ కనకనగర్‌లో ఉంటోంది. భనవంపై గిన్నెలు తోముతున్న సమయంలో సబ్బుపై కాలు పడి ఆమె జారింది. టెర్రస్ గోడ చిన్నగా ఉండటంతో ఆమె భవనం పైనుంచి కింద పడిపోయింది. మహిళ పక్కనే ఉన్న భర్త ఆమెను కిందపడకుండా ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతడి చేతి పట్టు సడలడంతో మహిళ మరింత కిందకు జారింది. ఈ క్రమంలో కిటికీ పట్టుకుని వేళాడిన ఆమె చివరకు కింద నిలిపి ఉంచిన వాహనాలపై పడి తీవ్ర గాయాలపాలైంది. అప్పటికే అప్రమత్తమైన స్థానికులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ మహిళకు ప్రాణాపాయం తప్పిందని, వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారని పోలీసులు తెలిపారు. మరోవైపు, ఘటనకు సంబంధించిన వీడియోను ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us