తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్న ఐఎండీ.
ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల విస్తరణతో పాటు ఆవర్తన ప్రభావంతో మరికొన్ని రోజులు వానలు కురిసే అవకాశం ఉంది. మరో వైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుదనం సంతరించుకోనున్నాయి. ఫలితంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.
ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల విస్తరణతో పాటు ఆవర్తన ప్రభావంతో మరికొన్ని రోజులు వానలు కురిసే అవకాశం ఉంది. మరో వైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుదనం సంతరించుకోనున్నాయి. ఫలితంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలో పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఐఎండీ. అలాగే, తెలంగాణలో కూడా పలు జిల్లాలకు వర్షసూచన చేసింది వాతావరణశాఖ. హన్మకొండ, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 15వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, మట్టి తొలగింపు పనులు నిలిచిపోయినట్టు చెప్పారు సింగరేణి అధికారులు. దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం కురవడంతో సత్తుపల్లిలో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలతోపాటు రోడ్లపైనా పెద్దఎత్తున నీరు నిలిచిపోయింది. సత్తుపల్లితోపాటు పెనుబల్లి, కల్లూరు మండలాల్లో కూడా కుండపోత వర్షం కురిసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

