నడిరోడ్డుపై మహిళ వింత పూజలు.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె గుభేల్ !!
మధ్యప్రదేశ్లో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ నడిరోడ్డుపై విచిత్ర పూజలు చేస్తూ వింతగా ప్రవర్తించింది. అది చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వాహనదారులు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేసి ఆగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో మహిళ రోడ్డు మధ్యలో వాటర్ బాటిల్, ఆయిల్, బ్యాగ్ తీసుకుని కూర్చుంది.
మధ్యప్రదేశ్లో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ నడిరోడ్డుపై విచిత్ర పూజలు చేస్తూ వింతగా ప్రవర్తించింది. అది చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వాహనదారులు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేసి ఆగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో మహిళ రోడ్డు మధ్యలో వాటర్ బాటిల్, ఆయిల్, బ్యాగ్ తీసుకుని కూర్చుంది. ఆ తరువాత అక్కడ మంటలు చెలరేగాయి.. మొదట్లో కొంత మంది ఆ మహిళను వింతగా చూస్తూ పక్కనుంచి వెళ్లిపోయారు. అంతలో ఆమె లేచి నిలబడి వింతగా వాహనదారులను చూడటం మొదలుపెట్టింది. దాంతో భయపడిపోయిన వారంతా ఎక్కడిక్కడే ఆగిపోయారు. అంతలోనే ఆమె ఆ మంట చుట్టూ ఎగురుతూ, దూకుతూ విచిత్రంగా ప్రవర్తించింది. ఆ తరువాత మంటల ముందు కూర్చుని తన జుట్టును విరబోసుకుని వింత వింతగా ప్రవర్తించింది. ఇది చూసి చాలా మంది తొలుత భయపడినా, ఆ తరువాత ఒక్కొక్కరుగా అక్కడ్నుంచి వెళ్లిపోయారు. అయితే, ఆ మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదని ఆ తరువాత అందరికీ తెలిసింది. అందువల్లే ఆమె నడిరోడ్డుపై కూర్చుని ఇలా పూజలు చేస్తుండగా, అందరూ ఆమె మంత్రాలు చదువుతోందని భయపడ్డారు. ఆమె వింత ప్రవర్తన చూసిన కొందరు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. దాంతో ఆమె వింతగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఏది స్పష్టంగా లేదు. వీడియో వైరల్గా మారటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను వెదుకుతూ ఆ మహిళ ఇంటికి చేరుకున్నారు. పోలీసుల విచారణలో ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని భర్త చెప్పాడు. కొన్నిసార్లు ఆమె ఇలాంటి వింత పనులు చేస్తుందని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్పేస్లో వీకాఫ్ ఎంజాయ్ చేసిన సునీతా విలియమ్స్
ఆహారం కావాలంటే సైనికుల కోర్కెలు తీర్చాల్సిందే
Kangana Ranaut: చిక్కుల్లో కంగన.. ఇప్పుడు ఎంపీ గారి పరిస్థితేంటి మరి ??
Salman Khan: స్టార్ హీరోకు ప్రాణ భయం.. అతడే నన్ను చంపాలనుకున్నాడు
ఏడాదికి రూ.2 కోట్ల జీతం.. సల్మాన్ బాడీగార్డ్ అంటే మామూలుగా ఉండదు చిన్నా