Viral Video: పోలీసులు కాదు.. వాళ్ల బాబుకి చెప్పుకో.. మహిళాను వేధించిన టీటీ..
ఓ మహిళా ప్రయాణికురాలిని టీటీ వేధింపులకు గురి చేసిన వీడియో నెట్టింట ప్రత్యక్షమైంది. వీడియో చూసిన నెటిజన్లు టీటీ తీరుపై మండిపడుతున్నారు. కృష్ణరాజపురం రైల్వే స్టేషన్‌లో టీటీ ప్రయాణికుల టికెట్‌లు చెక్ చేస్తున్నాడు.
మద్యం మత్తులో విమానాల్లో, రైళ్లలో కూడా ఇటు సిబ్బంది, ప్రయాణికులు కూడా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బెంగళూరులో ఓ మహిళా ప్రయాణికురాలిని టీటీ వేధింపులకు గురి చేసిన వీడియో నెట్టింట ప్రత్యక్షమైంది. వీడియో చూసిన నెటిజన్లు టీటీ తీరుపై మండిపడుతున్నారు. కృష్ణరాజపురం రైల్వే స్టేషన్‌లో టీటీ ప్రయాణికుల టికెట్‌లు చెక్ చేస్తున్నాడు. ఓ యువతి లగేజ్‌తో వెళ్తోంది. ఆమెను ఆపి టికెట్ అడిగాడు టీటీ. ఆమె తన ఫోన్‌లో టికెట్ చూపించే లోపే ఆమెపై విరుచుకుపడ్డాడు టీటీ. పోలీసులకు చెప్పుకో.. వాళ్ల బాబుకి చెప్పుకో.. ముందు టికెట్ చూపించు.. నాకు పనుంది అంటూ రెచ్చిపోయాడు. టీటీ తీరుకు ఆ యువతి కన్నీరు పెట్టుకుంది. ఇదంతా గమనించిన మరో ప్రయాణికుడు ఇది సరికాదంటూ వారించినా టీటీ వినలేదు సరికదా మరింత రెచ్చిపోయాడు. ఈ వీడియోనెట్టింట చేరి వైరల్ కావడంతో రైల్వే అధికారుల దృష్టికి చేరింది. రైల్వే అధికారులు టీటీని సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్. వీడియో
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

