Viral Video: పట్టాల మధ్య మహిళ.. ట్రాక్ పై పరుగులు పెడుతున్న రైలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
జనావాసాల్లో ఉండే రైల్వే ట్రాక్(Railway Track) లు ప్రజల ప్రాణాలు తీసిన ఘటనలు మనం ఎన్నో చూశాం. తరచూ ప్రమాదాల బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. వీటిని నివారించేందుకు అధికారులు ఎన్నో...
జనావాసాల్లో ఉండే రైల్వే ట్రాక్(Railway Track) లు ప్రజల ప్రాణాలు తీసిన ఘటనలు మనం ఎన్నో చూశాం. తరచూ ప్రమాదాల బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. వీటిని నివారించేందుకు అధికారులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పట్టాలపై దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అందుకు ఈ వీడియోనే నిదర్శనం. ఓ మహిళ రైలు పట్టాలు దాటుతూ ట్రాక్ పై పడిపోయింది. అదే సమయంలో అటుగా గూడ్స్ రైలు వచ్చింది. దీంతో ఆమె చాకచక్యంగా వ్యవహరించి, పట్టాల మధ్య పడుకుంది. రైలు వెళ్లిపోయేంతవరకు కదలకుండా అలాగే ఉండిపోయింది. ట్రైన్ వెళ్లిపోయాక క్షేమంగా బయటపడింది. ఫ్లాట్‌ఫామ్ పై ఉన్నవారందరూ తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఆమె క్షేమంగా బయటపడటంతో హమ్మయ్య అనుకున్నారు. అనంతరం రైలు కింద పడిన మహిళ.. అసలేమీ జరగనట్టుగా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లిపోవడం గమనార్హం. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా ట్విటర్ లో పోస్ట్ చేశారు. ‘‘ప్రాణాలకన్నా ఫోనే ముఖ్యం కదా మరి’’ అని సరదా కామెంట్ చేశారు. ‘‘ఇంత నిర్లక్ష్యమేమిటని, ముందు ఆ మహిళను అరెస్టు చేయాలని’’ పలువురు నెటిజన్లు ప్రధాన మంత్రి కార్యాలయానికి ట్యాగ్ చేశారు.
फ़ोन पर gossip, ज़्यादा ज़रूरी है ??♂️ pic.twitter.com/H4ejmzyVak
— Dipanshu Kabra (@ipskabra) April 12, 2022
Also Read
Asia Cup: శ్రీలంకలో ఆసియా కప్ జరిగేనా.. వచ్చే నెలలో తుది నిర్ణయం తీసుకుంటామన్న జైషా..
SRH vs KKR Highlights: చెలరేగి ఆడిన మర్‌క్రమ్, త్రిపాఠి.. 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం..