Cute Video: ఉప్పొంగిన మానవత్వం.. నడిరోడ్డుపై అద్భుత దృశ్యం..! విచిత్రంగా చూసిన జనం.

మారుతున్న కాలంతో పాటు మనుషులలో మానవత్వం కూడా కనుమరుగవుతోంది. తోడబుట్టినవారి కష్టాల్లో పాలు పంచుకోవడానికి కూడా ఒకటికి నూటిసార్లు ఆలోచిస్తోంది ప్రస్తుత మానవ సమాజం.

Cute Video: ఉప్పొంగిన మానవత్వం.. నడిరోడ్డుపై అద్భుత దృశ్యం..! విచిత్రంగా చూసిన జనం.

|

Updated on: May 08, 2023 | 9:02 PM

మారుతున్న కాలంతో పాటు మనుషులలో మానవత్వం కూడా కనుమరుగవుతోంది. తోడబుట్టినవారి కష్టాల్లో పాలు పంచుకోవడానికి కూడా ఒకటికి నూటిసార్లు ఆలోచిస్తోంది ప్రస్తుత మానవ సమాజం. అయితే మనుషులలో ఇంకా మానవత్వం చనిపోలేదు, కొనఊపిరితో ఇంకా బతికే ఉంది అన్నట్లుగా అడపాదడపా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కోడుతోంది. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కొన్ని బాతులు రద్దీగా ఉన్న ఓ రోడ్డుపైకి వచ్చాయి. అవి రోడ్డు దాటి తమ స్థావరానికి వెళ్లాలి. రోడ్డుపై వాహనాలు రద్దీ ఎక్కువగా ఉంది. ఒకదాని వెనుక వాహనాలు దూసుకొస్తున్నాయి. బిక్కు బిక్కుమంటూ రోడ్డు దాటుతున్న బాతులను ఓ వ్యక్తి గమనించి తన కారును ఆపేశాడు. అలా కార్లన్నీ నిలిచిపోయాయి. బాతులు క్షేమంగా రోడ్డు దాటేవరకూ 4 లైన్ల హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు సదరు వాహనదారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మానవత్వం ఇంకా బతికి ఉందనేందుకు ఈ వీడియో ఒక్కటి చాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ వీడియోను ఇప్పటివరకు 59 లక్షలమందికి పైగా వీక్షించారు. ఆరున్నర లక్షలమంది లైక్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!

Follow us