Minister Leak Video: నడిరోడ్డు మీద రెచ్చిపోయిన మంత్రి.. యువకుడికి చావుదెబ్బలు..! వీడియో వైరల్
తానొక ప్రజాప్రతినిధి అన్న విషయం మరిచిపోయాడు. నడిరోడ్డు మీద రెచ్చిపోయాడు. ఓ యువకుడిని పట్టుకుని చితకబాదాడు రాష్ట్ర మంత్రి. ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రేమ్‌చంద్ అగర్వాల్ నడిరోడ్డుమీద ఓ వ్యక్తిపై దాడి చేశాడు. మంత్రి అనుచరులు కూడా అతడిని చితకబాదారు.
తానొక ప్రజాప్రతినిధి అన్న విషయం మరిచిపోయాడు. నడిరోడ్డు మీద రెచ్చిపోయాడు. ఓ యువకుడిని పట్టుకుని చితకబాదాడు రాష్ట్ర మంత్రి. ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రేమ్‌చంద్ అగర్వాల్ నడిరోడ్డుమీద ఓ వ్యక్తిపై దాడి చేశాడు. మంత్రి అనుచరులు కూడా అతడిని చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి తీరుపై జనం మండిపడుతున్నారు. మంత్రి ప్రేమ్‌చంద్ అగర్వాల్ రిషికేశ్ పట్టణంలో తన కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇంతలో సురేంద్రసింగ్ నెగీ అనే వ్యక్తి తన బైక్‌తో మంత్రి వాహనాన్ని దాటబోయి ఢీకొట్టాడు. దీంతో, కారు నుంచి కిందకు దిగిన మంత్రి ప్రేమ్‌చంద్.. నేగిపై సీరియస్ అయ్యారు. వెంటనే నేగి చంప చెళ్లుమనిపించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం పెరిగింది. ఇంతలో, మంత్రి సిబ్బంది.. నేగిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ దాడిపై మంత్రి స్పందించారు. నేగి.. తనను అసభ్య పదజాలంతో తిట్టడంతో.. తన సిబ్బంది దాడి చేశారని సదరు మంత్రి చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే.. బాధ్యతాయుత పదవిలో ఉన్న మంత్రి ఇలాగేనా ప్రవర్తించేది? అని కాంగ్రెస్ మండిపడింది. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

