WhatsApp Calls: వాట్సాప్‌ కాల్స్‌తో వణికిపోతున్న జనం.. ఎందుకో తెలుసా.?

WhatsApp Calls: వాట్సాప్‌ కాల్స్‌తో వణికిపోతున్న జనం.. ఎందుకో తెలుసా.?

Anil kumar poka

|

Updated on: Aug 21, 2024 | 8:17 PM

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లలో కొందరికీ అప్పుడప్పుడు ఫేక్ కాల్స్, స్పామ్ మెసేజెస్ వస్తుంటాయి. తెలిసీ తెలియక కాల్ లిఫ్ట్ చేసినా, మెసేజ్‌లోని లింక్‌లపై క్లిక్ చేసినా మోసపోయినట్లే. క్షణాల్లో ఫోన్ హ్యాక్ కావడం లేదా బ్యాంక్ బ్యాలన్స్ మాయమవడం జగిరిపోతుంది. అంతేనా.? మీ వాట్సాప్‌లోని చాట్‌లతో పాటు, యాప్ వాయిస్, వీడియో కాల్‌లకు కూడా యాక్సెస్‌ సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఉంటుంది.

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లలో కొందరికీ అప్పుడప్పుడు ఫేక్ కాల్స్, స్పామ్ మెసేజెస్ వస్తుంటాయి. తెలిసీ తెలియక కాల్ లిఫ్ట్ చేసినా, మెసేజ్‌లోని లింక్‌లపై క్లిక్ చేసినా మోసపోయినట్లే. క్షణాల్లో ఫోన్ హ్యాక్ కావడం లేదా బ్యాంక్ బ్యాలన్స్ మాయమవడం జగిరిపోతుంది. అంతేనా..? మీ వాట్సాప్‌లోని చాట్‌లతో పాటు, యాప్ వాయిస్, వీడియో కాల్‌లకు కూడా యాక్సెస్‌ సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని వారాలుగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల తల్లిదండ్రులే టార్గెట్ గా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.

ఫేక్ కాల్స్ నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియని గ్రామీణీలు చాలా మంది సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కుకుని విలవిలలాడుతున్నారు. పోలీసు అధికారుల ఫోటో డి.పిలతో వాట్సాప్ కాల్స్ వస్తుండటంతో భయబ్రాంతులకు గురవుతున్నారు. నిర్మల్‌ జిల్లా భైంసా డివిజన్ పరిధిలో పదుల సంఖ్యలో వాట్సాప్‌ కాల్స్ బారిన పడి మోసపోయారు. గ్రామీణ ప్రజలకు గత 10 రోజులుగా వరుసగా వాట్సాప్ కాల్స్ బెంబేలెత్తిస్తున్నాయి. మీ పిల్లలు డ్రగ్స్‌ కేసులో అరెస్టై తమ వద్ద ఉన్నారంటూ తల్లిదండ్రులకు వాట్సాప్‌ కాల్స్‌ చేస్తున్నారు. ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపిస్తే వదిలేస్తామంటూ బెదిరిస్తున్నారు.

సైబర్‌ కేటుగాళ్లు తల్లిదండ్రుల పేర్లు, వారి పిల్లల పేర్లు కరెక్ట్‌గా చెబుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. అదికూడా పోలీసు అధికారుల ఫోటోతో కూడిన డి.పి ఉండడంతో ప్రజలు మరింత భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఫోన్ కాల్స్ వచ్చిన తరువాత తల్లి తండ్రులు విద్యార్థుల క్షేమం గురించి ఆరా తీస్తున్నారు. తీరా అది ఫేక్ కాల్స్ అని తెలిశాక ఊపిరి పిల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోఅపరిచితుల వ్యక్తుల కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి డబ్బులు పోయినట్లు పిర్యాదులు రాలేదని పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.