Nita Ambani: నీతా అంబానీ తాగే వాటర్ ధర రూ.27 వేలా.? అసలు స్టోరీ ఏంటి.?
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ విలాసవంతమైన జీవనశైలికి, అద్భుతమైన దుస్తులకు, ఖరీదైన వాచీలకి, క్వీన్ సైజ్ జీవితానికి ప్రసిద్ధి చెందింది. ఆమె వద్ద సాదాసీదా వస్తువులు లక్షలు, కోట్ల విలువైనవి ఉంటాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరైన నీతా అంబానీ తన విలాసవంతమైన జీవనశైలి కారణంగా తరచుగా వార్తల్లో ఉంటారు. ఆమె రోజువారీ ఉపయోగించే వస్తువులు కూడా సాధారణ విషయాలు కాదు.
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ విలాసవంతమైన జీవనశైలికి, అద్భుతమైన దుస్తులకు, ఖరీదైన వాచీలకి, క్వీన్ సైజ్ జీవితానికి ప్రసిద్ధి చెందింది. ఆమె వద్ద సాదాసీదా వస్తువులు లక్షలు, కోట్ల విలువైనవి ఉంటాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరైన నీతా అంబానీ తన విలాసవంతమైన జీవనశైలి కారణంగా తరచుగా వార్తల్లో ఉంటారు. ఆమె రోజువారీ ఉపయోగించే వస్తువులు కూడా సాధారణ విషయాలు కాదు. అందమైన ఆకారంలో ఉన్న బాటిల్ నుండి ఆమె నీళ్ళు తాగుతున్న ఫోటో ఇటీవల వైరల్ అయ్యింది.
అయితే తన అందాన్ని కాపాడుకోవడం కోసం, అలాగే ఆరోగ్యంగా ఉండటం కోసం నీతా అంబానీ ఖరీదైన వాటర్ తాగుతుందని ప్రచారంలో ఉంది. ఒక ప్రచారంలో ఆమె తాగే 750 మిల్లీలీటర్ల వాటర్ బాటిల్ ధర రూ. 27 వేలకుపైగా ఉంటుందనే వార్త వైరల్ అయ్యింది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీళ్లు ఇవేనని, ఈ వాటర్‌తో ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు చర్మం ఎప్పుడు కూడా మెరిసేలా ఉంటుందని, అంతేకాదు ఒత్తిడి సైతం దూరమవుతుందని ఈ వాటర్‌పై అనేక వార్తలు వచ్చాయి.
ఈ నీరు ఎక్కడ పడితే అక్కడ దొరకదని, వసంతకాలంలో ఫిజి, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశంలో ఏర్పడే గ్లేసియర్‌ల నుంచి సేకరిస్తారని, దాంతో పాటు ఖనిజ లవణాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయని కూడా ప్రచారం భారీగానే జరిగింది. అయితే దీనిపై .. మీ సౌందర్య రహస్యానికి, ఇంత హుషారుగా ఉండానికి గల కారణాలు నీళ్లేనా అంటూ ఓ సందర్భంలో నీతా అంబానీనే తెలిసిన వాళ్లు ఒకరు అడిగారట. ఇది విన్న నీతా అంబానీ ఆశ్చర్యపోయారట. ఖరీదైన నీళ్లంటూ జరుగుతున్న ప్రచారమంతా వట్టిదేనని, ఇందులో నిజం లేదని స్పష్టం చేశారట. మొత్తం మీద ఇంత ఖరీదైన వాటర్ అని వెలువడిన వార్తలు ఫేక్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

