Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వావ్ సూపర్.. వాట్సాప్‌లో ఇకపై వాయిస్ మెసేజ్‌లనూ చదివేయచ్చు!

వావ్ సూపర్.. వాట్సాప్‌లో ఇకపై వాయిస్ మెసేజ్‌లనూ చదివేయచ్చు!

Samatha J

|

Updated on: Jan 23, 2025 | 2:46 PM

అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా యాప్‌లలో వాట్సాప్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది WhatsApp యాప్‌ని ఉపయోగిస్తున్నారు. అందుకే.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రోజుకో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది మెటా. ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాం వైపు వినియోగదారులు వెళ్లకుండా చేయడం లాంగ్ స్టాండింగ్ కసరత్తే అయినా… ఎప్పటికప్పుడు ఆప్షన్స్ మారుస్తూ యూజర్స్‌ను మరింత ఆకర్షిస్తోంది. ఇక తాజాగా వాట్సాప్ లో ఉన్న చాలామంది ఎదుర్కొంటున్న ఓ సమస్యకు టెక్నాలజీతో మెటా పుల్‌స్టాప్ పెట్టింది. వాట్సాప్‌లో టెక్స్ట్‌ మెసేజ్‌లతోపాటు వాయిస్ మెసేజ్‌లు పంపుకోవచ్చు. చాలామంది బిజీగా ఉన్నప్పుడు ఈ వాయిస్ మెసేజ్‌లను వాడుతున్నారు. అయితే చాలా పెద్ద టెక్స్టింగ్ మెస్సెజ్ చేసే బదులు చిన్న వాయిస్ మెసేజ్‌లతో చెప్పాలనుకున్న విషయాలు చెప్పేస్తున్నారు.

 కానీ ఇందులో ఒక సమస్య ఉంది.. ఆ వాయిస్ మెసేజ్‌లను వినాలంటే కొంత ఇబ్బంది ఉంటుంది. మీటింగ్‌లో ఉన్నప్పుడు, సినిమా థియేటర్లో ఉన్నప్పుడు లేదా వ్యక్తిగతంగా వచ్చే వాయిస్ మెసేజ్‌లను వినాలి అనుకున్నప్పుడు సాధ్యం కావడం లేదు. ఒకవేళ పంపిన వాయిస్ మెసేజ్ ఏదైనా అర్జెంట్ మేటర్ అయితే ఇమ్మిడియేట్‌గా వినలేని పరిస్థితి ఉంటుంది.. పబ్లిక్ లో ఉన్నప్పుడు కొన్నిసార్లు వినిపించదు కూడా… అవతలి వ్యక్తికి టైప్ చేసే సమయం లేక అత్యవసర సమయంలో పంపే వాయిస్ మెసేజ్లను కూడా కొంతమంది వినలేకపోతున్నారు. దీనికి సొల్యూషన్ గా వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లని టెక్స్ట్ రూపంలో మార్చే ట్రాన్స్క్రిప్ట్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్ లో కొత్తగా వచ్చిన ట్రాన్స్‌క్రిప్ట్ ఆప్షన్.. మీకు వచ్చే వాయిస్ మెసేజ్ లను టెక్స్ట్‌ రూపంలోకి మార్చి చూపిస్తుంది. అది కూడా ఒక్క సెకండ్ లోపే.. ప్రస్తుతానికి నాలుగు భాషల్లో ఈ సదుపాయం కల్పించింది. ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, పోర్చుగీస్ భాషల్లో ఈ ట్రాన్స్క్రిప్ట్ అందుబాటులో ఉంది. ఇందుకోసం వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి… చాట్స్ అనే ఆప్షన్ లో మెసేజెస్ ట్రాన్‌స్క్రిప్ట్ అనే ఆప్షన్ ని ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు వచ్చిన వాయిస్ మెసేజ్ లపై క్లిక్ చేసి హోల్డ్ చేస్తే మీకు వచ్చే ఆప్షన్స్ లో మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ అని వస్తుంది. సింపుల్‌గా దాని పైన క్లిక్ చేస్తే మీ వాయిస్ మెసేజ్ మొత్తం దాని కింద టెక్స్ట్ రూపంలో మీకు కనిపిస్తుంది. చాలా పర్ఫెక్ట్ గా ఈ ఫీచర్ ప్రస్తుతానికి పని చేస్తోంది. త్వరలోనే భారతీయ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని వాట్సాప్ ప్రతినిధులు చెప్పారు.

Published on: Jan 23, 2025 02:22 PM