ప్రియురాలి భర్తను .. కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు.. చివరికి
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు డ్రైవర్. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారులో డ్రైవర్‌తో తన భార్య కలిసి ఉండడాన్ని చూడడమే ఆ వ్యక్తి చేసిన పాపం అయిపోయింది. వెంటనే ఆ కారును ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కారు బానెట్ పై పడ్డాడు. అయినా కారు ఆపకుండా ఆ డ్రైవర్ అలాగో ముందుకు ఈడ్చుకెళ్లాడు.
సమీర్ అనే వ్యక్తి తన భార్య.. మహీర్ అనే వ్యక్తితో కారులో ఉండడాన్ని చూశాడు. వెంటనే తన బైక్‌తో ఆ కారును అడ్డుకుని ఆపడానికి ప్రయత్నించాడు. మహీర్ తన కారును ఆపకుండా అలాగే పోనిచ్చాడు. దీంతో కారు బానెట్‌పై సమీర్ పడ్డాడు. బానెట్‌ను పట్టుకుని వేలాడుతున్న అతడిని అలాగే కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లాడు. పలువురు వాహనదారులు గమనించి, కారును ఆపమని హెచ్చరించారు. అయినా వినకపోవడంతో వెంబడించి కారును అడ్డుకున్నారు. అనంతరం మహీర్‌తో సమీర్ ఘర్షణకు దిగాడు. కారు బానెట్‌పై తనను ఈడ్చుకెళ్లడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మహీర్‌ను అరెస్ట్ చేశారు. అతడి కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామన్నారు పోలీసులు. మరోవైపు కొందరు వాహనదారులు రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
