Viral Video: ట్రైన్ లోకో ఫైలట్ ఎమర్జెన్సీ బ్రేక్‌.. మోటార్‌మ్యాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

|

Jan 03, 2022 | 4:38 PM

చనిపోవాలనుకున్న ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి రియల్‌ హీరో అనిపించుకున్నారు ఓ ట్రైన్‌ డ్రైవర్‌. ఏం కష్టం వచ్చిందో ఏమో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌ పైకి వెళ్లాడు. అదే ట్రాక్‌పై ట్రైన్‌ రావడం గమనించి పట్టాలపై పడుకున్నాడు.

Viral Video: ట్రైన్ లోకో ఫైలట్ ఎమర్జెన్సీ బ్రేక్‌.. మోటార్‌మ్యాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!
Train
Follow us on

Train Driver Uses Emergency Break: చనిపోవాలనుకున్న ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి రియల్‌ హీరో అనిపించుకున్నారు ఓ ట్రైన్‌ డ్రైవర్‌. ఏం కష్టం వచ్చిందో ఏమో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌ పైకి వెళ్లాడు. అదే ట్రాక్‌పై ట్రైన్‌ రావడం గమనించి పట్టాలపై పడుకున్నాడు. మొదట్లో రెండు కాళ్లు మాత్రమే పట్టాలపై ఉంచిన అతను.. రైలు దగ్గరకు వచ్చేస్తున్న సమయంలో.. తల తప్ప మిగతా శరీరమంతా పట్టాలపై ఉండేలా పడుకున్నాడు. అప్పుడే జరిగిందో అద్భుతం. అది గమనించిన ట్రైన్‌ డ్రైవర్‌ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్‌ వేశాడు. దాంతో ఆ వ్యక్తికి కొన్ని అడుగుల దూరంలో రైలు ఆగిపోయింది. ఇది గమనించిన రైల్వే పోలీసులు పరుగు పరుగున వచ్చి ఆ వ్యక్తిని పట్టాలపైనుంచి తరలించారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యింది. ఈ ఘటన ముంబైలోని శివ్‌డీ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన పుటేజ్‌ని రైల్వే తమ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది రైల్వే శాఖ.” మోటర్‌ మ్యాన్‌ చాలా మంచి పని చేశారు. పరిస్థితిని వేగంగా గ్రహించి ఎమర్జెన్సీ బ్రేక్‌ వేసి ప్రాణం కాపాడారు. మీ జీవితం చాలా విలువైనది. మీకోసం మీ వాళ్లు ఎదురుచూస్తుంటారు ”అంటూ కాప్షన్‌ పెట్టారు. వీడియోలో కనిపిస్తున్న టైమ్‌ని బట్టీ ఇది ఉదయం 11.45కి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూస్తున్న వేలమంది నెటిజన్లు ఎంతగానో లైక్‌ చేస్తున్నారు. ట్రైన్‌ డ్రైవర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ” ఆ మోటర్‌ మ్యాన్‌ పేరు చెప్పలేదు. దయచేసి రియల్ హీరోల పేర్లు కూడా చెప్పండి. అందుకు వాళ్లు అర్హులు. గొప్ప పనులు చేసిన వాళ్లకి ఫేమ్ రావాలి” అంటూ ఓ యూజర్ కామెంట్ ఇచ్చారు.


Read Also Palvancha Suicide Case: పాల్వంచ ముగ్గురు ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. తెరపైకి రాజకీయ కోణం!