ఓర్నీ ట్యాలెంటో.. కారును అక్కడెలా పార్క్ చేశావ్ సామీ
అతివేగం.. మద్యం సేవించి వాహనాలు నడపడం.. నిద్రమత్తులో వాహనాలు నడపడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతారు. ఒక్కోసారి అదుపుతప్పి వాహనాలను ఇళ్లలోకి, రోడ్డుపక్కన ఉండే దాబాల్లోకి పోనిస్తుంటారు డ్రైవర్లు. కొందరు మాత్రం వీటన్నిటికీ భిన్నంగా ఏకంగా గోడలపైకి ఎక్కిస్తుంటారు.
తాజాగా అలాంటి ఘటనే మేడ్చల్ జిల్లాలో జరిగింది. ఓ వాహనదారుడు ఏకంగా తన కారును తీసుకెళ్లి గోడపై పార్క్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఓర్నీ ట్యాలెంటో.. కారుని అక్కడెలా పార్క్ చేశావ్ బ్రో అంటున్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంభీపూర్‌లో నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ వచ్చిన డ్రైవర్.. కారును ఇంటి ముందున్న ప్రహరీ గోడపైకి ఎక్కించాడు. ప్రమాదం జరిగిన సమయంలో భారీ శబ్ధం రావడంతో ఇంట్లో వాళ్లు నిద్రలేచి బయటకు పరుగెత్తుకొచ్చారు. ఇంటి బయట కనిపించిన దృశ్యాన్ని చూసి వారు నివ్వెరపోయారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో వెంటనే ప్రమాదస్థలికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో కారును కిందకు దింపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరలవుతుండగా.. నెటిజన్లు తమదైనశైలిలో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బీమా సొమ్ము కోసం.. కాళ్లు కట్ చేయించుకున్న డాక్టర్
చౌడేశ్వరి ఆలయంలో అర్థరాత్రి వేళ వెలుతురు.. వెళ్లి చూస్తే షాక్
అయ్యో.. చిట్టి చింపాంజీ చేసిన పనికి తల పట్టుకున్న తల్లి
Andhra Pradesh: కాబోయే తల్లులకు సూపర్ గుడ్‌న్యూస్..!
బెంగుళూరులో హడలెత్తించిన సైకో పోలీస్ రియల్ కథ! ది బెస్ట్ డార్క్ థ్రిల్లర్ సిరీస్!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

