AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీమా సొమ్ము కోసం.. కాళ్లు కట్ చేయించుకున్న డాక్టర్

బీమా సొమ్ము కోసం.. కాళ్లు కట్ చేయించుకున్న డాక్టర్

Phani CH
|

Updated on: Jul 31, 2025 | 9:07 PM

Share

ఏదైనా ప్రమాదం జరిగితోనో లేక అనారోగ్యం పాలైతేనో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చాలామంది ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. తమకేదైనా అయితే కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో ఇంకొందరు పాలసీ తీసుకుంటారు. అయితే.. పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందనే ఆశతో ఓ డాక్టర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు.

తర్వాత ఆపరేషన్ చేయించుకొని.. తన కాళ్లను మోకాళ్ల కిందికి తీసేయించుకున్నాడు. ఆనక..బీమా సొమ్ము క్లెయిం చేసి అడ్డంగా దొరికిపోయిన ఘటన బ్రిటన్‌లో జరిగింది. బ్రిటన్‌లో నెయిల్‌ హావర్‌ అనే వైద్యుడు ఇన్సూరెన్స్‌ డబ్బులు కోసం ఆపరేషన్ చేయించుకుని, మోకాళ్ల కింది నుంచి తీసేయించుకున్నాడు. ఆనక గతంలో తాను తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీని క్లెయిమ్ చేశాడు. అయితే.. అది రూ. 5.8 కోట్ల మొత్తం కావటంతో ఇన్సూరెన్స్ కంపెనీ ఈ కేసును ఆరా తీసింది. అతడు కావాలనే ఆపరేషన్‌ చేయించుకున్నాడని, ఇది నిబంధనలకు విరుద్ధం కనుక అతడికి బీమా సొమ్ము ఇవ్వలేమని.. తగిన ఆధారాలతో సదరు బీమా సంస్థ కోర్టుకు నివేదించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. కాగా, ఈ ఆపరేషన్ కోసం.. మారియస్ గుత్సావ్‌సన్ అనే డాక్టర్‌ని ప్రలోభ పెట్టాడని బీమా సంస్థ ఆరోపించింది. అంతకు ముందే.. అతడు ప్రాణానికి ప్రమాదం లేకుండా మోకాళ్లను తొలగించుకోవటం ఎలా? అనే అంశంపై పలు సార్లు ఇంటర్ నెట్‌లోనూ వెతికాడని, ఒక వెబ్‌సైట్ నుంచి ఆ ఆపరేషన్ తాలూకూ వీడియోలను కొనుగోలు చేశాడని కూడా ఆధారాలతో సహా బీమా సంస్థ కోర్టుకు సమర్పించింది. తనకు రక్తనాళాల సమస్య ఉందని, మోకాళ్లను తొలగించుకోకపోతే ప్రాణానికే ప్రమాదమని నమ్మబలికాడని బీమా సంస్థ తరపు లాయరు కోర్టుకు వివరించాడు. కాగా, ఈ ఆపరేషన్ చేసిన వైద్యుడు మారియస్, చేయించుకున్న నెయిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చౌడేశ్వరి ఆలయంలో అర్థరాత్రి వేళ వెలుతురు.. వెళ్లి చూస్తే షాక్‌

అయ్యో.. చిట్టి చింపాంజీ చేసిన పనికి తల పట్టుకున్న తల్లి

Andhra Pradesh: కాబోయే తల్లులకు సూపర్ గుడ్‌న్యూస్..!

బెంగుళూరులో హడలెత్తించిన సైకో పోలీస్ రియల్‌ కథ! ది బెస్ట్ డార్క్‌ థ్రిల్లర్ సిరీస్‌!

ఈయన ఇలా ఉన్నాడేంట్రా ?? ఇంట్లో దొంగలు పడితే పిలిచి డబ్బిస్తారా ??