అదృష్టం అంటే ఇదే.. కూలీకి దొరికిన ‘8 వజ్రాలు’
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా పలకరిస్తుందో ఎవరూ చెప్పలేరు. కూటికి లేన వాడికీ అదృష్టం పడితే.. తెల్లారేసరికి కోటీశ్వరుడై పోతాడనే మాటను నిజం చేసే ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పన్నాలోని వజ్రాల గనిలో దినసరి కూలీకి ఏకంగా 8 వజ్రాలు దొరికాయి. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇన్నాళ్లకు భగవంతుడు తమపై దయ చూపించాడంటూ అతడు సంతోషం వ్యక్తం చేశాడు.
మధ్య ప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలోని కటియా గ్రామానికి చెందిన హర్ గోవింద్, పవన్ దేవి దంపతులు గత ఐదేళ్లుగా పన్నాలోని నిసార్ గనిలో పనిచేస్తున్నారు.వజ్రం కోసం తవ్వుతూనే ఉన్న ఈ దంపతులకు చివరికి అదృష్టం తలుపుతట్టింది. ఒకేసారి 8 వజ్రాలు లభించాయి. అందులో కొన్నీ ముడి వజ్రాలు కాగా, మరికొన్ని శుద్ధమైనవే. వీటి విలువ రూ.10 – 12 లక్షలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వజ్రాలను పన్నాలోని వజ్రాల మ్యూజియానికి చేర్చి, అక్కడి నిపుణులు వాటి విలువను అంచనా వేశాక.. వాటిని వేలం వేయనున్నారు. వేలంలో వచ్చిన మొత్తం నుంచి టాక్సులు పోగా మిగిలిన డబ్బును గోవింద్ కుటుంబానికి అందజేయనున్నారు. ఈ సందర్భంగా హర్‌గోవింద్ మాట్లాడుతూ…‘భగవంతుడు ఈసారి మమ్మల్ని కనికరించాడు. గతంలో ఓసారి ఒక వజ్రం దొరికితే.. తెలియక లక్షకే అమ్మాను. ఈసారి ఆ తప్పు చేయను’అని చెప్పుకొచ్చాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సౌరవ్యవస్థలో అరుదైన వస్తువు.. ఏలియన్స్‌కు చెందినదా
ఓర్నీ ట్యాలెంటో.. కారును అక్కడెలా పార్క్ చేశావ్ సామీ
బీమా సొమ్ము కోసం.. కాళ్లు కట్ చేయించుకున్న డాక్టర్
చౌడేశ్వరి ఆలయంలో అర్థరాత్రి వేళ వెలుతురు.. వెళ్లి చూస్తే షాక్
వాచ్మెన్ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!
బైక్‌పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!
యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం

