Teen Built Underground den in Spain: మీరు మీ పేరెంట్స్‌పై అలిగితే ఏం చేస్తారు… మహా అయితే ఓ పూట భోజనం మానేస్తారు. లేకుంటే ఎటైనా వెళ్లి తిరిగి వస్తారు. ఓ బాలుడు మాత్రం చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారింది.
తల్లి తిట్టిందని ఓ గడుగ్గాయ్ చేసిన పని ఉప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. స్పెయిన్‌కు చెందిన ఆండ్రెస్ కాంటో ఐదేళ్ల పాటు చేస్తున్న ఈ పని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. చూసిన వాళ్లంతా వార్నీ అని నోరెళ్లబెడుతున్నారు. ఇతనికి ట్రాస్ సూట్ అంటే చాలా ఇష్టం. దాన్ని వేసుకొని బయటకు వెళ్లాలని కోరిక. తల్లిదండ్రులు మాత్రం కుదరదని చెప్పేశారు. కోపడ్డారు. దీంతో కోపం వచ్చిన ప్రతి సారీ గుహ తవ్వడం స్టార్ట్ చేశాడు. రోజూ కొన్ని గంటల పాటు ఇదే పని చేసేవాడు. స్కూల్ నుంచి రావడం… ఇంట్లో కోప్పడితే ఇంటి వెనుక్కు వెళ్లిపోయి సొరంగం తవ్వేవాడు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా ఆరేళ్ల పాటు ఈ బాలుడికి ఇదే పని.
ఆరేళ్లపాటు ఇలా తవ్వడంతో ఇంటి వెనుకాల ఓ గుహలా ఏర్పడింది. ఈ సొరంగం తవ్వడం తర్వాత అలవాటైపోయింది. ఇందులో తన మిత్రుడిని కూడా చేర్చాడీ ఆండ్రెస్. అక్కడ ఉండటానికి గదిని… దాంట్లో ఒక బెడ్, కుర్చీ ఏర్పాటు చేసుకున్నారు. బాత్రూం కూడా నిర్మించుకున్నారు. ఓ చిన్న హోటల్‌ల్లో ఉండే సౌకర్యాలన్నింటినీ సమకూర్చుకున్నారు. సొరంగం పూర్తయ్యే నాటికి ఆండ్రెస్ 20 ఏళ్లు. ఇప్పుడు ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడీ కుర్రాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.