వారెవ్వా.. ఇది కదా ప్రేమంటే..తన భర్త మరో మహిళను చూడగానే ఆడ గొరిల్లా ఏం చేసిందంటే?
భర్త పొగడ్త ఏదైనా సరే.. అది పూర్తిగా తనకే చెందాలి. అలా కాదని పొరపాటున వేరే ఎవరినైనా పొగిడినా, వాళ్లను మెచ్చుకున్నా అతనికి తన భార్య చేతిలో మామూలుగా ఉండదు.. అలాంటి పరిస్థితే ఓ గొరిల్లాకు ఎదురైంది. ఈ ఘటన చూసి నెటిజన్లు మనిషైనా..జంతువైనా భార్యకు భయపడాల్సిందేనని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జూకి వెళ్లిన ఓ యువతి గొరిల్లాల ఎన్‌క్లోజర్ వద్ద నిల్చుని వాటిని చూస్తోంది. ఇంతలో ఓ మగ గొరిల్లా మహిళకు దగ్గరగా వచ్చి ఆ యువతి జుట్టును పట్టుకుని అబ్బా నీ హెయిర్ ఎంత బావుందో అన్నట్టుగా ముద్దు చేసింది. దూరాన్నుంచి ఇది గమనించిన ఆడ గొరిల్లా వెంటనే అక్కడికి దూసుకొచ్చింది. ఇక్కడ నేనుండగానే ఆ అమ్మాయిని టచ్ చేస్తావా..ఉండు నీపని చెప్తా అన్నట్టుగా.. మగ గొరిల్లాపై దాడి చేసింది. దానిని వెనక్కి లాగిపడేసింది. అంతటితో ఆగకుండా, మగ గొరిల్లాను పొట్టు పొట్టుగా కొట్టింది. ఈ అనూహ్య ఘటనను అక్కడున్న పర్యాటకులు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. ఆడ గొరిల్లా ప్రవర్తనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఆడ గొరిల్లా నిజమైన భార్య అనిపించుకుందని ఒకరు, తప్పుచేసిన భర్తకు మహబాగా బుద్ధి చెప్పిందని మరొకరు సరదాగా కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
డేంజర్: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్నారా? వీడియో
హమ్మయ్య..ఇక్కడ దాక్కుంటే ఎవరికీ కనిపించను వీడియో
భోజనానికి వస్తున్నా అని తల్లికి ఫోన్.. అంతలోనే.. వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
