పొద్దున్నే తలుపు తీయగానే.. గుండెలు బద్దలయ్యే సీన్ వీడియో
వర్షాకాలంలో జనావాసాల్లోకి పురుగూ పుట్రా చొచ్చుకుని వస్తుంటాయి. సాధారణంగా వరద సమయంలో పెద్ద పెద్ద పాములు కూడా నివాస ప్రాంతాల్లో కనిపించి జనాల్ని బెంబేలెత్తిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉదయాన్నే తలుపు తీసిన యజమానికి వాకిలి ముందు.. బుసలు కొడుతున్న పెద్ద నాగుపాము కనిపించింది. దీంతో, ఆయన భయంతో వణికిపోతూ.. సాయం కోసం అరిచి కేకలు వేశాడు.
ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలోని చాప్రౌలి పట్టణంలో ఓ ఇంటి యజమాని రోజూ మాదిరిగానే లేచి, మార్నింగ్ వాక్ కోసమని తలుపు తీశాడు. ఆయన బయట అడుగు వేద్దామనుకునే లోపే.. వాకిలి ముందు కనిపించిన పెద్ద నాగుపామును చూసి.. ఒక్కసారి షాకయ్యాడు. తలుపు తీసి, తన దిశగా వస్తున్న వ్యక్తిని చూసిన పాము.. ఒక్కసారిగా అడుగున్నర ఎత్తున లేచి, బుసలు ఇంటిలోకి దూరటంతో ఇంటి యజమాని భయంతో వణికిపోతూనే, పెద్దగా అరిచి కేకలు వేశాడు. దీంతో, ఇంట్లో వాళ్లంతా నిద్ర లేచి బయటికి వచ్చి, ఆ పామును చూసి షాకయ్యారు. ఒక్క క్షణం తర్వాత తేరుకున్న ఇంటి యజమాని, నెమ్మదిగా ఇంట్లోని వాళ్లందరినీ బయటికి తీసుకుపోయి, స్నేక్ క్యాచర్ కి సమాచారం ఇవ్వటంతో వాళ్లు వచ్చి దానిని బంధించారు. ఈ లోపు ఇరుగుపొరుగు వారు అక్కడ పోగవటం, అక్కడి యువకులు ఈ సీన్ అంతటినీ వీడియో తీసి వైరల్ చేశారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు సైతం షాకవుతూ.. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
డేంజర్: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్నారా? వీడియో
హమ్మయ్య..ఇక్కడ దాక్కుంటే ఎవరికీ కనిపించను వీడియో
భోజనానికి వస్తున్నా అని తల్లికి ఫోన్.. అంతలోనే.. వీడియో
అటు భర్త.. ఇటు లవర్.. ముగ్గురం కలిసి ఎంజాయ్ చేద్దాం.. అంటూ..
యజమాని కోసం.. ఎనిమిదేళ్లుగా ఆసుపత్రిలోనే తిరుగుతున్న కోడిపుంజు!
భారత్లో ఈ 9 నగరాలు టాప్!
కుక్కను చూసి చిరుత పరుగో.. పరుగు.. ఏం జరిగిందో మీరే చూడండి!
కోతుల బెడదకు చెక్.. బామ్మగారి ఐడియా అదిరిందిగా!
అత్తారింటికి దారేది? అయ్యో.. ఈ నవ వధువుకి ఎంత కష్టం వచ్చింది!
పెట్రోలును మంచినీళ్లలా తాగేసిన యువకుడు!

