AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేంటి భయ్యా.. తాగకుండానే పాజిటివ్‌ వీడియో

ఇదేంటి భయ్యా.. తాగకుండానే పాజిటివ్‌ వీడియో

Samatha J
|

Updated on: Jul 17, 2025 | 12:40 PM

Share

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో దొరికిపోయి కొందరు జరిమానాలు చెల్లిస్తున్నారు. మరికొందరు జైలుకు వెళ్లి శిక్ష అనుభవిస్తున్నారు. మద్యం తాగే అలవాటు ఉన్నవారికి డ్రంక్ అండ్ డ్రైవ్ పెద్ద సమస్యగా మారింది. కానీ మద్యం తాగకుండానే కొందరికి ఈ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చింది. తమకు అసలు డ్రింక్ చేసే అలవాటు లేకున్నా ఇలా ఎందుకు వచ్చిందని తలలు పట్టుకుంటున్నారు. అయితే అది బ్రీత్ ఎనలైజర్ మిషన్ ప్రాబ్లమ్‌ అని కొందరు వాదిస్తున్నారు.

అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో డ్రింక్ తీసుకోకుండా పాజిటివ్ రావడానికి కారణం ఏంటి?కడుపులో జరిగే కొన్ని రసాయన క్రియల వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుందంటున్నారు వైద్యులు. దీనినే Auto Bravery Syndrome అని అంటారు. అంటే కడుపులో గ్యాస్ లాగా తయారైన ఒక వాయువు నోటి ద్వారా రావడంతో ఇది ఆల్కహాల్ గా మారిపోయి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో పాజిటివ్‌గా చూపిస్తుంది. కడుపులో ఉండే గ్యాస్ట్రో లో కుడి ఎడమవైపు ఉన్న ఆమ్లాలు కలిసిపోయి ఇథనాల్ ను రిలీజ్ చేస్తాయి. దీంతో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో ఆల్కహాల్ తీసుకున్నట్లుగా చూపిస్తుంది.ఈ ఇథనాల్ రిలీజ్ అయిన సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో మాత్రమే కాకుండా శరీరంలో కూడా అనేక మార్పులు వస్తాయంటున్నారు వైద్యులు. దీంతో తీవ్రమైన నీరసం వస్తుంది. డిప్రెషన్‌కు గురవుతారు. అంతేకాకుండా మద్యం సేవించిన వారిలా మత్తుగా ఉంటారు. ఒక్కోసారి మాట తడబడుతూ ఉంటుంది. చాలా విషయాలు మర్చిపోతూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఇథనాల్ రిలీజ్ కావడంతో లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మానసికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

డేంజర్: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్‌ పెట్టి నిద్రపోతున్నారా? వీడియో

హమ్మయ్య..ఇక్కడ దాక్కుంటే ఎవరికీ కనిపించను వీడియో

భోజనానికి వస్తున్నా అని తల్లికి ఫోన్‌.. అంతలోనే.. వీడియో