ఫోన్ చూసీ.. చూసీ.. చివరికి ఒక వ్యక్తికి ఏమైందో తెలుసా?వీడియో
మీ పిల్లలు కానీ, మీరు కానీ స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? అయితే జర జాగ్రత్త. అలవాటు మార్చుకోకపోతే తీవ్రమైన సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది. గంటల తరబడి మెడ వంచి ఫోన్ చూస్తున్నట్లయితే మెడ పనితీరు దెబ్బతినొచ్చు. తలపైకి ఎత్తే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోవచ్చు. తాజాగా ఓ 25 ఏళ్ల యువకుడి విషయంలో అదే జరిగింది.
జపాన్‌లోని 25 ఏళ్ల యువకుడు డ్రాప్డ్ హెడ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు డాక్టర్లు నిర్థారించారు. ఫోన్ చూసీ.. చూసీ.. నిరంతరం సాగదీతకు గురైంది అతని మెడ ఎముక. అలాగే స్కార్ టిష్యూ ఏర్పడి వెన్నపూసలో తీవ్రమైన మార్పులు జరిగినట్లు గుర్తించారు. మెడపై వాపుతో పాటు మెడను కదిలించేందుకు సహకరించే కీళ్లు అతనిలో దెబ్బతిన్నాయి. కండరాలు పూర్తిగా పనిచేయకుండా స్తంభించిపోయాయి. ఈ అరుదైన స్థితినే వైద్య పరిభాషలో ‘డ్రాప్డ్ హెడ్ సిండ్రోమ్’ DHSగా పిలుస్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జపాన్ యువకుడికి ఈ వ్యాధి కొంతకాలంగా ఉంది. అతని కేసును స్టడీ చేసి ఈ పరిస్థితికి దారి తీసిన కారణాలను JOS జర్నల్‌లో కేస్ స్టడీగా ప్రచురించారు. చిన్నతనంలో చురుగ్గా ఉన్న పిల్లాడు టీనేజ్ వయసులో తీవ్ర ఒత్తిడి లోనయ్యాడట. సహ విద్యార్థుల బెదిరింపులకు దూరంగా ఒంటరిగా ఫోన్ చూడటం అలవాటు చేసుకున్నాడు. మెడ వంచి గంటల తరబడి ఫోన్ చూడటంతో కొన్నేళ్లకి మెడలో సమస్య మొదలైంది.
మరిన్ని వీడియోల కోసం :
డేంజర్: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్నారా? వీడియో
హమ్మయ్య..ఇక్కడ దాక్కుంటే ఎవరికీ కనిపించను వీడియో
భోజనానికి వస్తున్నా అని తల్లికి ఫోన్.. అంతలోనే.. వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
