మనవళ్లే.. ఆ రైతన్నకు కాడెద్దులు వైరల్ వీడియో
రుతుపవనాల వల్ల వర్షాలు కురవటంతో అన్ని ప్రాంతాల్లో రైతులు పొలం బాట పడుతున్నారు. దుక్కులు దున్ని విత్తనాలు చల్లేందుకు రైతాంగం రెడీ అవుతోంది. అయితే, ఆర్థిక స్థోమత లేని కొందరు రైతన్నలు మాత్రం ఎప్పట్లాగే సాగు పనుల విషయంలో నానా తిప్పలు పడుతున్నారు. కర్నూలు జిల్లాలో పేదరికంలో మగ్గుతున్న ఓ రైతన్న తన భూమిని దున్నటం కోసం తన మనవళ్ళను కాడెద్దులుగా మార్చి దుక్కి దున్నాడు. హృదయ విదారకమైన ఈ ఘటన తాలూకూ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
సాధారణంగా పొలాన్ని ఎద్దులతో దున్నుతారు. కానీ కర్నూలు జిల్లా గోనెగొండ్ల కు చెందిన కౌలంట్లయ్య అనే రైతు, తన రెండెకరాలు పత్తి చేలో కలుపు తొలగించేందుకు.. సొంత మనవళ్ళనే కాదేద్దులుగా మార్చాడు. రెండేకరాలలో పత్తి పంట వేసిన ఈ రైతన్న.. తన పొలంలో గుంటక తోలించటానికి అడగగా, రెండు వేల రూపాయలు బాడుగ అడిగారు. అంత డబ్బు ఆ రైతు వద్ద లేకపోవటంతో సొంత మనవళ్లనే బతిమాలుకుని, వారిచేత గుంటక లాగించాడు. ఆ రైతు కష్టాన్ని చూసిన కర్నూలుకు చెందిన సుశీల నేత్రాలయం అధినేత డాక్టర్ సుధాకర్ చలించిపోయారు. ఆ రైతుకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. P4 ప్రోగ్రాం క్రింద రైతు కౌలుంట్లయ్యకు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా చెక్ ను అందజేశారు. ఎద్దులు కొనుగోలు చేసి, సాగు చేసుకోవాలని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం :
డేంజర్: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్నారా? వీడియో
హమ్మయ్య..ఇక్కడ దాక్కుంటే ఎవరికీ కనిపించను వీడియో
భోజనానికి వస్తున్నా అని తల్లికి ఫోన్.. అంతలోనే.. వీడియో
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
