Attack on MLA: ఎమ్మెల్యేను బట్టలు చింపేసి, తరిమి కొట్టిన గ్రామస్తులు..! ఎందుకంటే..?
కర్నాటకలోని చిక్‌మగళూర్ జిల్లా ముడిగెరె బీజేపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామిపై కుందూరు గ్రామస్తులు దాడి చేశారు. ఏకవచనాల్లో ప్రశ్నించడం మొదలుపెట్టి,
కర్నాటకలోని చిక్‌మగళూర్ జిల్లా ముడిగెరె బీజేపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామిపై కుందూరు గ్రామస్తులు దాడి చేశారు. ఏకవచనాల్లో ప్రశ్నించడం మొదలుపెట్టి, దూషించి, ఎమ్మెల్యే బట్టలు చింపేశారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఏనుగుల గుంపు దాడిలో ఓ మహిళ చనిపోవడంతో స్థానికులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఏనుగుల సంచారంపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికి ఎమ్మెల్యే కుమారస్వామి పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన స్థానిక మహిళ శోభ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఏనుగుల బెడదపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నప్పటికీ ఆలస్యంగా రావడంపై గ్రామస్థులు బీజేపీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్టలు చింపేసి, కొట్టడం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే కుమారస్వామిని చుట్టుముట్టిన గుంపును అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మరోవైపు పోలీసు శాఖ తనకు రక్షణ కల్పించడంలో విఫలమైందని ఎమ్మెల్యే కుమారస్వామి ఆరోపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

