ఇంత వెధవల్లా ఉన్నారేంట్రా! కుంభమేళాలో మహిళల స్నానం

Updated on: Feb 25, 2025 | 5:45 PM

మహిళలపై వేధింపులకు తెగబడుతున్న కేటుగాళ్లు కుంభమేళాలో పవిత్ర గంగా స్నానమాచరించిన మహిళల ఫొటోలు, వీడియోలను సైతం వదిలిపెట్టడం లేదు. ఆ కంటెంట్ ను అమ్మకానికి పెట్టారు. ఆ విష సంస్కృతి ఇప్పుడు మహాకుంభమేళాకు పాకడంతో పోలీసులు అలర్టయ్యారు సోషల్ మీడియా ప్రొఫైల్స్/టెలిగ్రామ్ గ్రూపులను గుర్తించి, ఎఫ్ ఐఆర్ నమోదు చేస్తామన్నారు.

వీడియోలను తొలగించాలని మెటాతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు భక్తులు పెద్దఎత్తున వస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ క్రమంలో కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళా భక్తుల వీడియోలు అమ్మకానికి పెట్టిన రెండు సోషల్‌ మీడియా అకౌంట్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళల గోప్యత, గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి వీడియోలను కొన్ని ఫ్లాట్‌ఫారమ్‌లు అప్‌లోడ్‌ చేస్తున్నాయి. సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్‌ దీన్ని గుర్తించింది. దీనిపై కోత్వాల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఆ వీడియోలు అప్‌లోడ్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను గుర్తించేందుకు మెటా నుంచి వివరాలు కోరినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు టెలీగ్రామ్‌ ఛానళ్లలో ఈ వీడియోలు విక్రయిస్తున్నట్లు మరో కేసు నమోదైంది. వీటిపై దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. మహాకుంభమేళాకు సంబంధించి అభ్యంతరకరమైన, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సామాజిక మాధ్యమాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రి మరణించిన దుఃఖంలో ఉన్నా.. సాయం మరవని ప్రభాస్‌

ఛావా సినిమా ఎఫెక్ట్ ! ట్రెండ్ అవుతున్న సింగర్ వైశాలి

ఉదిత్‌ను కోర్టుకు ఈడ్చిన మాజీ భార్య! ఆ సింగర్‌కు కష్టాలే కష్టాలు!

హ్యాట్సాఫ్‌! తలకు గాయమైనా.. సినిమా ప్రమోషన్‌కు డుమ్మా కొట్టేదేలే

మఠానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చిన స్టార్ హీరో.. ధర ఎంతో తెలుసా?