రైల్వే ట్రాక్ బోల్ట్‌లు తొలగించిన దుండగులు వీడియో
పహల్గాం ఉగ్రదాడిలో నేపథ్యంలో యావత్ దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం అన్ని రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు.ఈ నేపథ్యంలో చెన్నైలోని అరకోణంలో జరిగిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.
గురువారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు రైల్వే ట్రాక్ బోల్ట్‌లను తొలగించారు. కానీ, అదృష్టవశాత్తు రైల్వే అధికారుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆ ట్రాక్‌పై ప్రయాణించే పలు రైళ్లను బెంగళూరు, కేరళ వైపు మళ్లించారు. ఈ నేపథ్యంలోనే పలు ట్రైన్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఆకతాయిలు చేసిన పనా..? లేదంటే, ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీ సేకరించారు. వాటి అధారంగా విచారణ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో
జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్‌లో దారుణం.. వీడియో
ఆడ స్పైడర్‌ను ఆకర్షించేందుకు డ్యాన్స్..పడిపోయిందా ఒకే..! లేదంటే వీడియో
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

