Viral Video: నాన్నా ప్రేమగా మాట్లాడడు., అమ్మ నాతో ఆడుకోదు.. 4 ఏళ్ల చిన్నారి ఆవేదన.

తల్లిదండ్రుల ప్రేమానుబంధం.. చిన్నారుల ఎదుగుదలపై మంచి ప్రభావాన్ని చూపిస్తుందంటున్నారు నిపుణులు. వారి మనసును తెలుసుకుంటూ.. ప్రేమను పంచే దంపతుల పెంపకంలో పిల్లల మానసికారోగ్యం పెంపొందుతుందని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుత యాంత్రిక జీవనంలో కాలంతో పాటు మనిషి పరిగెత్తాల్సిందే. ఉద్యోగం చేసే తల్లిదండ్రులైతే ఉదయం బయటికెళితే.. తిరిగి ఇంటికి చేరుకునే సరికి రాత్రవుతుంది.

Viral Video: నాన్నా ప్రేమగా మాట్లాడడు., అమ్మ నాతో ఆడుకోదు.. 4 ఏళ్ల చిన్నారి ఆవేదన.

|

Updated on: Dec 03, 2023 | 5:23 PM

తల్లిదండ్రుల ప్రేమానుబంధం.. చిన్నారుల ఎదుగుదలపై మంచి ప్రభావాన్ని చూపిస్తుందంటున్నారు నిపుణులు. వారి మనసును తెలుసుకుంటూ.. ప్రేమను పంచే దంపతుల పెంపకంలో పిల్లల మానసికారోగ్యం పెంపొందుతుందని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుత యాంత్రిక జీవనంలో కాలంతో పాటు మనిషి పరిగెత్తాల్సిందే. ఉద్యోగం చేసే తల్లిదండ్రులైతే ఉదయం బయటికెళితే.. తిరిగి ఇంటికి చేరుకునే సరికి రాత్రవుతుంది. ఇందుకు కారణాలు ఏవైనా.. ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతుందనేది వాస్తవం. దీంతో చాలా మంది పిల్లలు తమపై తల్లిదండ్రులకు ప్రేమ లేదనే భావనకు గురవుతున్నారట. ఇదే విషయమై ఓ చిన్నారి వ్యక్తం చేసిన ఆవేదనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దక్షిణ కొరియా లో చిన్నారుల కోసం ‘మై గోల్డెన్ కిడ్స్’ అనే పాపులర్‌ టీవీ షో నిర్వహిస్తుంటారు. ఇందులో పాల్గొన్న సాంగ్‌ ఇయో జున్‌ అనే నాలుగేళ్ల పిల్లాడు.. ఇంట్లో తాను ఒంటరిగా ఉంటానని, తనతో ఎవరూ ఆడుకోరని చెబుతున్న మాటలు ప్రతి ఒక్కరి మనసుల్ని కలచివేస్తున్నాయి. అంతేకాకుండా యాంకర్‌ అడిగిన ప్రశ్నలకు సాంగ్‌ చెప్పే సమాధానాలు తల్లిదండ్రులపై అతనికున్న ఆలోచనను ప్రతిబింబిస్తున్నాయి. సాంగ్‌ తండ్రి గురించి చెబుతూ.. నాన్న కోపంతో ఉన్నప్పుడు తనకు భయమేస్తుందని ఆయన తనతో ప్రేమగా మాట్లాడితే బాగుంటుందని అన్నాడు. అలాగే, అమ్మకు తానంటే ఇష్టం లేదని, తనతో ఎప్పుడూ ఆడుకోదని.. కన్నీళ్లను బిగపట్టి చెబుతున్న మాటలు షోలో ఉన్నవారితోపాటు వీడియో చూస్తున్న వారిని ఆలోచింప చేస్తున్నాయి. దాంతో పాటు అమ్మ.. తనతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు సాంగ్‌ చెప్పాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ప్రస్తుత సమాజంలో చాలా మంది పిల్లలు సాంగ్ పరిస్థితినే ఎదుర్కొంటున్నారని కామెంట్లు చేస్తున్నారు. సాంగ్ చెబుతున్న మాటలు చూసి అతని తల్లిదండ్రులు ఇకపై ప్రేమగా ఉంటామని, ఎక్కువ సమయం గడుపుతామని చెప్పినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us