White Lung Syndrome: అమెరికాను వణికిస్తున్న వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌.! యాంటీబయాటిక్స్‌కి లొంగని వ్యాధి !

White Lung Syndrome: అమెరికాను వణికిస్తున్న వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌.! యాంటీబయాటిక్స్‌కి లొంగని వ్యాధి !

Anil kumar poka

|

Updated on: Dec 03, 2023 | 5:35 PM

బ్యాక్టీరియల్‌ నిమోనియాకు సంబంధించిన ఒక కొత్త రకం ఇన్‌ఫెక్షన్‌ చైనా, డెన్మార్క్‌, అమెరికా, నెదర్లాండ్స్‌ను వణికిస్తోంది. ‘వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌’గా పిలుస్తున్న ఈ రుగ్మత ప్రధానంగా 3-8 ఏళ్ల వయసు చిన్నారులకు సోకుతోంది. ఈ వ్యాధి బాధితుల ఊపిరితిత్తులకు స్కాన్‌ నిర్వహించినప్పుడు తెల్లరంగు మచ్చల్లాంటివి కనిపిస్తున్నాయి. అందువల్లే దానికి ఆ పేరు పెట్టారు. మైక్రోప్లాస్మా నిమోనియా అనే బ్యాక్టీరియాలోని కొత్త వేరియంట్‌తో ఈ ఇన్‌ఫెక్షన్‌ వస్తున్నట్లు భావిస్తున్నారు.

బ్యాక్టీరియల్‌ నిమోనియాకు సంబంధించిన ఒక కొత్త రకం ఇన్‌ఫెక్షన్‌ చైనా, డెన్మార్క్‌, అమెరికా, నెదర్లాండ్స్‌ను వణికిస్తోంది. ‘వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌’గా పిలుస్తున్న ఈ రుగ్మత ప్రధానంగా 3-8 ఏళ్ల వయసు చిన్నారులకు సోకుతోంది. ఈ వ్యాధి బాధితుల ఊపిరితిత్తులకు స్కాన్‌ నిర్వహించినప్పుడు తెల్లరంగు మచ్చల్లాంటివి కనిపిస్తున్నాయి. అందువల్లే దానికి ఆ పేరు పెట్టారు. మైక్రోప్లాస్మా నిమోనియా అనే బ్యాక్టీరియాలోని కొత్త వేరియంట్‌తో ఈ ఇన్‌ఫెక్షన్‌ వస్తున్నట్లు భావిస్తున్నారు. చాలా రకాల యాంటీబయాటిక్స్‌ దీనిపై పనిచేయవని నిపుణులు చెబుతున్నారు. డెన్మార్క్‌లో ఇది మహమ్మారి స్థాయికి చేరుతోందని వార్తా కథనాలు వస్తున్నాయి. నెదర్లాండ్స్‌లోనూ ఆందోళనకర రీతిలో వ్యాప్తి చెందుతోంది. అమెరికాలోని ఒహాయోలో ఈ కేసులు నమోదవుతున్నాయి. దీని బారినపడిన చిన్నారులు ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది.

వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌.. దగ్గు, తుమ్ములు, సంభాషణలు, శ్వాస ద్వారా వ్యాప్తి చెందుతుంది. శ్వాస నుంచి వెలువడే చిన్నపాటి తుంపర్లలో ఈ వ్యాధి కారక సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ వ్యాధి సోకినవారిలో జ్వరం, దగ్గు, శ్వాసలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటీవల చైనాలో పెరిగిన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు ఈ కొత్త వ్యాధికారకంతో సంబంధం లేదని అమెరికా అధికారులు తెలిపారు. చైనా లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి నానాటికీ పెరుగుతుండటం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఇదే సమయంలో బ్యాక్టీరియల్‌ నిమోనియాకు సంబంధించిన వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌ అమెరికా సహా పలు దేశాలను వణికిస్తోంది. దీంతో ఈ మిస్టరీ వ్యాధి పట్ల రిపబ్లికన్‌ సెనెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అమెరికా, చైనా మధ్య ప్రయాణాలపై నిషేధం విధించాలని కోరుతూ అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.