Viral: డాక్టర్‌కి ఫీజు ఇవ్వాల్సి వస్తుందని సొంతం వైద్యం చేస్తే.. ఇదుగో ఇలాగే ఉంటుంది.

Viral: డాక్టర్‌కి ఫీజు ఇవ్వాల్సి వస్తుందని సొంతం వైద్యం చేస్తే.. ఇదుగో ఇలాగే ఉంటుంది.

Anil kumar poka

|

Updated on: Dec 03, 2023 | 5:03 PM

చాలామంది ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా.. వెంటనే మెడికల్‌ షాపుకు వెళ్లి ట్యాబ్లెట్స్‌ కొని తెచ్చుకొని వేసేసుకుంటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం. ఇటీవల ఇంటర్నెట్‌ సౌలభ్యం అధికం కావడంతో ప్రతి చిన్న విషయానికీ ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసి మరీ దానికి సంబంధించిన మందులను డాక్టర్‌ను సంప్రదించకుండానే వాడేస్తున్నారు కొందరు. తద్వారా అనారోగ్యసమస్యలు మరింత పెరిగి, చివరికి పరిస్థితి చేజారాక డాక్టర్‌ దగ్గరకు పరుగెత్తుతుంటారు.

చాలామంది ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా.. వెంటనే మెడికల్‌ షాపుకు వెళ్లి ట్యాబ్లెట్స్‌ కొని తెచ్చుకొని వేసేసుకుంటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం. ఇటీవల ఇంటర్నెట్‌ సౌలభ్యం అధికం కావడంతో ప్రతి చిన్న విషయానికీ ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసి మరీ దానికి సంబంధించిన మందులను డాక్టర్‌ను సంప్రదించకుండానే వాడేస్తున్నారు కొందరు. తద్వారా అనారోగ్యసమస్యలు మరింత పెరిగి, చివరికి పరిస్థితి చేజారాక డాక్టర్‌ దగ్గరకు పరుగెత్తుతుంటారు. తాజాగా అలాంటిసంఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కూతురికి అనారోగ్యం చేస్తే ఆమె తండ్రి ఆన్‌లైన్‌లో వెతికి మందులు తెచ్చి ఇచ్చేవాడు. అలా కొన్నాళ్లకు ఆమె ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించాడు. ఆమెకు ఆపరేషన్‌ చేసి ప్రాణాలు కాపాడారు వైద్యులు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ (AINU)లోని కన్సల్టెంట్‌ యూరాలజిస్టు డాక్టర్‌ రాఘవేంద్ర కులకర్ణి శుక్రవారం మీడియాకు తెలిపారు.

డాక్టర్‌ కులకర్ణి తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ యువతి ఆర్కిటెక్టుగా పనిచేస్తున్నారు. ఆమెకు పదేపదే జ్వరం, మూత్రంలో మంట రావడంతో ఇటీవల ఏఐఎన్‌యూలో చేర్చారు. సీటీ స్కాన్‌ చేసిన వైద్యులు ఆమె మూత్రపిండాల్లో 13 మిల్లీమీటర్ల పరిమాణం ఉన్న కొన్ని రాళ్లను గుర్తించారు. అప్పటి వరకూ చేయించిన చికిత్సపై తండ్రిని, కుమార్తెను ఆరా తీశారు. దాంతో అసలు విషయం తెలిసిందని వివరించారు. ఆమెకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు తండ్రి గూగుల్‌లో వెతికి యాంటీ బయాటిక్స్‌ తెచ్చి ఇచ్చేవారని, అవి కూడా సగం కోర్సు వాడేసి వదిలేసేవారని డాక్టర్‌ రాఘవేంద్ర చెప్పారు. దానివల్ల శరీరంలో యాంటీ బయాటిక్స్‌ నిరోధకత పెరిగి.. మందులకు లొంగని బ్యాక్టీరియా ఏర్పడిందని తెలిపారు. అతిగా యాంటీ బయాటిక్స్‌ వాడడం వల్ల ప్రొటీన్లు గట్టిపడి అవి మూత్రపిండాల్లో రాళ్లుగా మారాయని.. అది యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌కు దారితీసిందని వివరించారు. ఆమెకు శస్త్రచికిత్స ద్వారా రాళ్లను తొలగించామన్నారు. వైద్యుల సూచనలు లేకుండా యాంటీ బయాటిక్స్‌ మందులు వినియోగించడం ప్రమాదకరమని డాక్టర్‌ రాఘవేంద్ర సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.