అరుదైన సంఘ‌ట‌న‌.. ఒకే వ్య‌క్తికి ఏక‌కాలంలో మంకీపాక్స్‌, క‌రోనా

అరుదైన సంఘ‌ట‌న‌.. ఒకే వ్య‌క్తికి ఏక‌కాలంలో మంకీపాక్స్‌, క‌రోనా

Phani CH

|

Updated on: Jul 27, 2022 | 9:19 PM

ప్ర‌పంచాన్ని మూడేళ్లు అత‌లాకుత‌లం చేసిన క‌రోనా ఇప్పుడు కాస్త శాంతించింది. అక్క‌డ‌క్క‌డా కొవిడ్‌-19 కేసులు వెలుగు చూస్తున్నా ప్రాణాంతకంగా మార‌డం లేదు.



ప్ర‌పంచాన్ని మూడేళ్లు అత‌లాకుత‌లం చేసిన క‌రోనా ఇప్పుడు కాస్త శాంతించింది. అక్క‌డ‌క్క‌డా కొవిడ్‌-19 కేసులు వెలుగు చూస్తున్నా ప్రాణాంతకంగా మార‌డం లేదు. అయితే, ఇప్పుడు ప్ర‌పంచాన్ని మంకీపాక్స్ క‌ల‌వ‌ర‌పెడుతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా దేశాల్లో మంకీపాక్స్ విస్త‌రించింది. ఇండియాలోనూ మూడు కేసులు వెలుగుచూశాయి. కాగా, అమెరికాలో అరుదైన సంఘ‌ట‌న జ‌రిగింది. ఒకే వ్య‌క్తికి ఏక‌కాలంలో మంకీపాక్స్‌, క‌రోనా వైర‌స్ సోకాయి. మిట్చో థాంప్సన్‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. అదే స‌మ‌యంలో అత‌డి శ‌రీరంపై ఎర్ర‌ని ద‌ద్దుర్లు క‌నిపించాయి. ప‌రీక్ష‌లు చేయించుకోగా మంకీపాక్స్ అని తేలింది. అత‌డికి ఏక‌కాలంలో మంకీపాక్స్‌, క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు వైద్యులు కూడా నిర్ధారించారు. ఈ రెండు వైర‌స్‌ల వ‌ల్ల అత‌డు వారాల‌పాటు మంచానికే ప‌రిమిత‌మ‌య్యాడు. ఇది అరుదైన కేసుగా వైద్యులు అభివ‌ర్ణించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చేపల కోసం వల వేస్తే.. దాదాపు రూ.28కోట్ల విలువ చేసే ??

రెండు ఫ్యామిలీల మధ్య భారీ ఘర్షణ !! షాకింగ్ వీడియో వైరల్‌

అమ్మనాన్నలు ఎక్కిన విమానంకు.. కొడుకే పైలట్‌

5వ అంతస్తు నుంచి పడిన చిన్నారి.. స్పైడర్‌మ్యాన్‌లా కాపాడిన కామన్‌మ్యాన్‌

ఇదేమి విచిత్రం !! బార్‌ ముందు యువకుడిని కొట్టిన యువతి

 

Published on: Jul 27, 2022 09:19 PM