రెండేళ్లుగా ఇంట్లోనే మృతదేహం !! అయినా అద్దె తీసుకున్న యజమాని !!

రెండేళ్లుగా ఇంట్లోనే మృతదేహం !! అయినా అద్దె తీసుకున్న యజమాని !!

Phani CH

|

Updated on: Jul 27, 2022 | 9:21 PM

ఓ 58 ఏళ్ల మహిళ తానుంటున్న అద్దె ఇంట్లోనే మరణించింది. రెండేళ్ళగా ఆమె మృతదేహం అక్కడే కుళ్లిపోయి అస్థిపంజరంగా మారింది. అయితే, యథావిధిగా అద్దె వసూలు చేసుకుంటూ వెళ్లిందా హౌసింగ్‌ సొసైటీ.

ఓ 58 ఏళ్ల మహిళ తానుంటున్న అద్దె ఇంట్లోనే మరణించింది. రెండేళ్ళగా ఆమె మృతదేహం అక్కడే కుళ్లిపోయి అస్థిపంజరంగా మారింది. అయితే, యథావిధిగా అద్దె వసూలు చేసుకుంటూ వెళ్లిందా హౌసింగ్‌ సొసైటీ. డబ్బులు చెల్లించడం లేదంటూ అప్పటికే ఆమె ఫ్లాట్‌కు గ్యాస్‌ సరఫరానూ నిలిపివేసింది. అద్దె మాత్రం ఆమె సామాజిక ప్రయోజనాల అకౌంట్‌ నుంచి వసూలు చేసింది. ఈ షాకింగ్‌ ఘటన బ్రిటన్‌లోని పెక్‌హామ్‌లో వెలుగుచూసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇక్కడి ఓ ఫ్లాట్‌లోని సోఫాలో మానవ అస్థిపంజర అవశేషాలు బయటపడ్డాయి. దంత అవశేషాలను పరీక్షించి.. ఆమెను అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న షీలా సెలియోనేగా గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైన నేపథ్యంలో.. పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె మరణానికి సరైన కారణం బయటపడలేదు. ఆమెకు అనారోగ్య సమస్యలున్నాయని చివరిసారి ఆగస్టు 2019లో ఓ వైద్యుడిని కలవడానికి వెళ్ళినప్పుడు బయట కనిపించినట్లు విచారణలో వెల్లడైంది. ఆమె అద్దె చెల్లించడం అదే చివరిసారి. అప్పటినుంచి చెల్లించకపోవడంతో.. ‘పీబాడీ’ హౌసింగ్‌ సొసైటీ ఆ మహిళ సామాజిక ప్రయోజనాల అకౌంట్‌ నుంచే అద్దె వసూలు చేసుకుంటోంది. జూన్ 2020లో మాత్రం ఆమె ఫ్లాట్‌కు గ్యాస్ సరఫరా నిలిపేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చేపల కోసం వల వేస్తే.. దాదాపు రూ.28కోట్ల విలువ చేసే ??

రెండు ఫ్యామిలీల మధ్య భారీ ఘర్షణ !! షాకింగ్ వీడియో వైరల్‌

అమ్మనాన్నలు ఎక్కిన విమానంకు.. కొడుకే పైలట్‌

5వ అంతస్తు నుంచి పడిన చిన్నారి.. స్పైడర్‌మ్యాన్‌లా కాపాడిన కామన్‌మ్యాన్‌

ఇదేమి విచిత్రం !! బార్‌ ముందు యువకుడిని కొట్టిన యువతి

Published on: Jul 27, 2022 09:21 PM