5వ అంతస్తు నుంచి పడిన చిన్నారి.. స్పైడర్‌మ్యాన్‌లా కాపాడిన కామన్‌మ్యాన్
ఓ వ్యక్తి స్పైడర్ మ్యాన్‌లా ఓ చిన్నారి ప్రాణాలను కాపాడాడు. స్పైడర్ మ్యాన్ సినిమాలో హీరో ఏవిధంగా చిన్నారులను రెస్క్యూ చేస్తాడో అదే విధంగా ఇప్పుడో రియల్ హీరో సూపర్బ్‌గా చిన్నారిని కాపాడాడు.
ఓ వ్యక్తి స్పైడర్ మ్యాన్‌లా ఓ చిన్నారి ప్రాణాలను కాపాడాడు. స్పైడర్ మ్యాన్ సినిమాలో హీరో ఏవిధంగా చిన్నారులను రెస్క్యూ చేస్తాడో అదే విధంగా ఇప్పుడో రియల్ హీరో సూపర్బ్‌గా చిన్నారిని కాపాడాడు. చైనాలోని జెంజియాంగ్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడయాలో తెగ వైరల్ అవుతుంది. షెన్ డాంగ్ అనే వ్యక్తి వీధి పక్కన తన కారును పార్క్ చేస్తున్నాడు. అదే సమయంలో పెద్దగా కేకలు వినిపించాయి. పక్కగా చూస్తే ఎత్తయిన భవనంలోని ఐదో అంతస్తు కిటికీ నుంచి ఓ చిన్న పాప కిందకు జారి పడిపోతోంది. దీంతో షెన్ డాంగ్, అతడి భార్య వేగంగా ముందుకు పరుగెత్తుకొచ్చి రెండు చేతులు చాచి పాపను పట్టుకున్నారు. కిటికీ నుంచి పడిపోతున్న సమయంలో ముందుగా ఆ చిన్నారి ఒక స్టీల్ రూఫ్ మీద పడింది. అక్కడి నుంచి మెళ్లిమెళ్లిగా జారుకుంటూ క్షణాలలో కిందకు జారింది. దీంతో వెంటనే అప్రమత్తమైన షెన్ డాంగ్.. ఆ చిన్నారిని ఒడిసిపట్టుకున్నాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేమి విచిత్రం !! బార్ ముందు యువకుడిని కొట్టిన యువతి
Viral Video: పిల్లాడిని ముట్టుకుంటే ఖబర్దార్.. అంటున్న పెంపుడు కుక్క
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

