పక్షి ప్రేమికుడి అరెస్ట్.. పోలీసులపై మండిపడుతున్న నెటిజన్లు
అమెరికాలో ఓ వృద్ధుడిని విచిత్రమైన నేరారోపణతో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల చర్య పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
అమెరికాలో ఓ వృద్ధుడిని విచిత్రమైన నేరారోపణతో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల చర్య పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. డోనాల్డ్ అంటాల్ అనే 71 ఏళ్ళ వ్యక్తి తన ఇంటి ముందు పక్షుల కోసం కొన్ని ట్రేలు ఏర్పాటు చేశాడు. వాటిల్లో అవి తినే వేరుశనక్కాయలు, కొన్ని గింజలను ఆహారంగా పెట్టాడు. ఐతే ఇదంతా నచ్చని పొరిగింటివారు అతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పైగా వన్యప్రాణులకు చట్టవిరుద్ధంగా ఆహారం పెడుతున్నాడంటూ అభియోగాలు మోపీ మరీ అరెస్టు చేశారు. పక్షుల కోసం రెండు ట్రేలను మించి ఆహార ట్రేలు పెట్టరాదని.. ఇది విలేజ్ ఆఫ్ సోడస్ పాయింట్ స్థానిక ఆర్డినెన్స్ ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించడమే అంటూ ఆరోపణల చేసి అరెస్టు చేశారు. అంతేకాదు ఈ ఆరోపణలతోటే ఆ వృద్ధుడిని ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు అరెస్టు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క కండోమ్ ప్యాకెట్ ధర రూ. 60 వేలు !! ఈ అసాధారణ పరిస్థితి ఎక్కడంటే ??
చనిపోయిన తండ్రి.. కూతురి పెళ్లిలో ప్రత్యక్షం..కంటతడి పెట్టిస్తున్న వీడియో
Strange Laws: వింత చట్టాలు !! స్నానం చేయక పోయినా… నవ్వినా.. జైలుకే !!
కోపంతో రగిలిపోతున్న భారీ కోబ్రాను.. ఈజీగా పట్టేసిన యువకుడు !!
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?

