కోపంతో రగిలిపోతున్న భారీ కోబ్రాను.. ఈజీగా పట్టేసిన యువకుడు !!

కోపంతో రగిలిపోతున్న భారీ కోబ్రాను.. ఈజీగా పట్టేసిన యువకుడు !!

Phani CH

|

Updated on: Jun 20, 2022 | 9:43 AM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అవి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. తాజాగా ఓ పాముకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అవి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. తాజాగా ఓ పాముకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాముల్లో కోబ్రా ఒకటి. దాని ఒక చుక్క విషం.. నిమిషాల్లోనే ప్రాణం తీస్తుంది. అలాంటి భయంకరమైన పామును ఓ వ్యక్తి సెకన్లలో సులభంగా పట్టుకున్నాడు. ఈ వీడియో అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటిది చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రోడ్డు పక్కన ఉన్న భారీ నాగుపామును పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఎలాంటి సేఫ్టీ ఎక్విప్‌మెంట్ కూడా లేకుండానే పామును పట్టుకున్నాడు. అతను పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో.. అది అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నం కూడా చేసింది. అయినా ఏ మాత్రం భయం లేకుండా సులభంగా దాని కాటు నుంచి తప్పించుకుని, చాకచక్యంగా చేతితో ఆ భారీ పామును పట్టుకుని అటవీప్రాంతాల్లో వదలిపెట్టాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క కండోమ్‌ ప్యాకెట్ ధర రూ. 60 వేలు !! ఈ అసాధారణ పరిస్థితి ఎక్కడంటే ??

చనిపోయిన తండ్రి.. కూతురి పెళ్లిలో ప్రత్యక్షం..కంటతడి పెట్టిస్తున్న వీడియో

Strange Laws: వింత చట్టాలు !! స్నానం చేయక పోయినా… నవ్వినా.. జైలుకే !!

Published on: Jun 20, 2022 09:43 AM