Bride Video: గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపిన వధువు.. స్పెషల్ టీం తో వెతుకుతున్నారు మరి..
ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగే పెళ్లి వేడుకల్లో గన్‌తో కాల్పులు జరుపడం తరచూ చూస్తుంటాం.. ఇలాంటి సెలబ్రెటీ కాల్పులకు సంబంధించిన కొన్ని సంఘటనల్లో కొందరు మరణించగా పలువురు గాయపడ్డారు.
ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో తన పెళ్ళిలో తానే గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపింది ఓ వధువు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వధువు కోసం వెతుకుతున్నారు. శుక్రవారం రాత్రి సేలంపూర్ గ్రామంలో ఒక జంటకు పెళ్లి జరిగింది. వివాహ తంతులో భాగంగా వధువరులు పూలదండలు మార్చుకున్నారు. అనంతరం పెళ్లి వేదికపై ఉన్న ఆసనంపై కూర్చున్నారు. ఈ సందర్భంగా 23 ఏళ్ల వధువు రాగిణి కుటుంబానికి చెందిన ఒకరు ఆ స్టేజీ పైకి వచ్చి ఆమె చేతికి రివాల్వర్ ఇచ్చాడు. దీంతో పైకి గురిపెట్టిన ఆమె గాల్లోకి వరుసగా నాలుగు రౌండ్లు కాల్పులు జరిపింది. అనంతరం రివాల్వర్‌ను ఆ వ్యక్తికి తిరిగి ఇచ్చింది. వధువు పక్కన ఉన్న వరుడు కొంత ఆందోళనతో అలాగే కూర్చుండిపోయాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

