దవాఖానలో మోగిన పెండ్లి బాజాలు వీడియో
కొన్ని పెళ్లిళ్లు విచిత్రంగా జరుగుతుంటాయి. మహూర్త బలం గట్టిదయితే ఎన్ని అవాంతరాలు వచ్చినా మూడు ముళ్లను అడ్డుకోలేవు. ప్రేమ వివాహాం చేసుకోవాలా? పెద్దలు కుదిర్చిన వ్యక్తితో కలిసి నడువాలా? ఇవే అంశాలు ఇప్పుడు యువతను సందేహంలో పడేస్తున్నాయి. ప్రేమించినవాడు పెళ్లి వరకు తీసుకెళతాడా మధ్యలోనే బ్రేకప్ చెప్పేస్తాడా తెలియని రోజులు ఇవి. కానీ పెద్దలు కుదిర్చిన వివాహాలు మాత్రం ఏదో తెలియని ఉపద్రవం వస్తే తప్పా మూడు ముళ్లు పడటం వరకు అంతా పక్కాగా జరిగిపోతుంటుంది. ఇక పెళ్లి కూతురు మీద వరుడికి ప్రేమ చిగురించాలే కానీ పిడుగులు పడినా ఆ పెళ్లి మాత్రం అపలేరు. అందుకు సాక్ష్యమే కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జరిగిన పెళ్లి.
నిత్యం ఆపరేషన్లు, రోగులు, చికిత్స, మందులు, ఇంజక్షన్లు వంటి మాటలు మాత్రమే వినిపించే దవాఖానలో పెండ్లి బాజాలు మోగాయి. ఎమర్జెన్సీ రూమే పెండ్లి మండపంగా మారింది. కేరళ రాష్ట్రం కొచ్చిలోని వీపీఎస్ లేక్‌షోర్ అనే ప్రైవేట్ హాస్పిటల్‌లో అవనీ, వీఎం షారోన్‌ల వివాహం డాక్టర్లు, నర్సులు, సిబ్బందితో పాటు కొద్దిపాటి బంధువుల సమక్షంలో జరిగింది.అవనీ, షారోన్‌ల వివాహం శుక్రవారం మధ్యాహ్నం థంబోలిలో జరగాల్సి ఉంది. అయితే మేకప్ కోసం వెళ్లిన పెండ్లి కుమార్తె అవనీ వాహనం ప్రమాదానికి గురవ్వడంతో ఆమె గాయపడింది. దీంతో ఆమెను ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. దీంతో దవాఖానలోనే ఆ పెండ్లి కుమార్తె మెడలో పెండ్లి కొడుకు మూడు ముళ్లు వేయడంతో వారి వివాహం జరిగిపోయింది.
మరిన్ని వీడియోల కోసం :
బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో
ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో
బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
