భర్త బస్సు ఎక్కలేదని దూకేసిన భార్య.. తర్వాత వీడియో
గ్రామీణ లైఫ్ స్టైల్‌కు, పట్టణ లైఫ్ స్టైల్‌కు చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా భార్య భర్తల మధ్య అనుబంధం, అనురాగంలో ఆ తేడాను గమనిస్తుంటాం. వివాహం అయిన దగ్గర నుంచి కట్టె కాలే వరకు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత అనుబంధాన్ని పెనవేసుకుంటారు. ఇక వృద్ధాప్యంలోనయితే అ అనురాగం మరింత పెరుగుతుంది. ఒకరికొకరు తోడుగా ఉంటూ, ఇంటి పనిలోనూ చేరోచేయి వేస్తుంటారు. ఆ అనురాగమే ఓ వృద్ధురాలిని ప్రమాదానికి గురి చేసింది. కంగారులో కదులుతున్న బస్సు దిగబోయి..అదుపుతప్పి పడిపోవడంతో బస్సు టైరు ఆమె కాలు మీది నుంచి వెళ్లింది. దీంతో కాలు ఛిద్రమైంది.
బాపట్ల జిల్లా అమృతలూరు మండలం గోవాడకు చెందిన వృద్ధులైన దావూలూరి నర్సమ్మ భర్త సుబ్బారావు పనిమీద శుక్రవారం చెరుకుపల్లికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం ఐలాండ్ కూడలి వద్ద నర్సమ్మ తెనాలి డిపో ఆర్టీసీ బస్సు ఎక్కింది. వెనుక ఉన్న సుబ్బారావు ఇంకా బస్సు ఎక్కకపోవడం, డ్రైవర్ బస్సును ముందుకు కదిలించడంతో ఆమె ఆందోళన చెందింది. మా ఆయన బస్సు ఎక్కలేదు..ఆపండంటూ డ్రైవర్‌ను కోరింది. వెనుక వాహనాలు వస్తుండటంతో ఆయన పక్కకు తీసి నిలిపే ప్రయత్నం చేశాడు. అయితే బస్సు ఆగకుండా వెళ్లిపోతోందని భావించినా ఆమె దిగేందుకు ప్రయత్నించి కిందపడింది. బస్సు వెనుక టైర్లు ఆమె ఎడమ కాలుపై ఎక్కడంతో నుజ్జునుజ్జు అయింది. ఆమె పెద్దగా కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపేశాడు.
మరిన్ని వీడియోల కోసం :
బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో
ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో
బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో
