డ్రైవింగ్ అంటే మాములు విషయం కాదు. దానికి చాలా స్కిల్ ఉండాలి. రెండు కాళ్లు, రెండు చేతులు పనిచేయాలి. మైండ్ ఫోకస్ కూడా ఉండాలి. వీటిలో ఏది తక్కువ ఉన్నా ప్రమాదాలు జరుగుతాయి. అందునా లారీ అయితే పెద్ద వాహనం కాబట్టి మరింత అప్రమత్తత అవసరం. కాగా స్కిల్‌కి, సమయస్ఫూర్తికి కేరాఫ్ అడ్రస్ లాంటి ఒక డ్రైవర్‌ను మీకు పరిచయం చేయబోతున్నాం. బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఏకంగా 3 కిలోమీటర్ల పాటు రివర్స్ గేర్‌లో లారీ నడిపాడు ఈ డ్రైవర్. ప్రస్తుతం ఈ ఘటన వైరల్‌గా మారింది. కాగా డ్రైవర్ రివర్స్ లారీ నడుపుతున్న సమయంలో అతడికి కొందరు బైక్‌పై వెళ్తున్నవారు రూట్ గైడ్ చేశారు. లారీ వెనుక రహదారిపై ట్రాఫిక్ క్లియర్ చేస్తూ వెళ్లారు. అలా ఆ లారీ ఓ పొలంలోని ఖాళీ స్థలంలోకి మలుపు తిప్పాడు. ఆ తర్వాత ఓ మైదాన ప్రాంతంలో నేల వదులుగా ఉండటంతో లారీని ఆపడం సాధ్యమైంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్రేక్ ఫెయిల్ అవ్వగానే ఏం చెయ్యాలో అర్థం కాక పానిక్ అయిపోతే.. పెను ప్రమాదం సంభవించేది. ఈ డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రమాదాన్ని అధిగమించాడు. ఈ ఘటన ఈ ఏడాది జనవరిలో చోటుచేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతుంది.
Also Read: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న సినిమా సెట్.. ఆలోచనలో పడ్డ దృశ్యం2 మేకర్స్..