Adilabad: అడవుల్లో అక్షరదేవాలయం.. కార్పొరేట్‌ విద్యార్ధులతో పోటీపడుతున్న గిరిజన విద్యార్ధులు.

Adilabad: అడవుల్లో అక్షరదేవాలయం.. కార్పొరేట్‌ విద్యార్ధులతో పోటీపడుతున్న గిరిజన విద్యార్ధులు.

Anil kumar poka

|

Updated on: Jul 12, 2023 | 7:31 PM

చుట్టూ దట్టమైన దండకారణ్యం.. పక్కనే కొండలు కో‌నలు.. సెలయేర్లు.. పచ్చని‌ ప్రశాంతమైన వాతవరణంలో బాహ్యా ప్రపంచానికి దూరంగా విసిరిసేనట్టుగా ఉండే ఓ కుగ్రామం. ఒకప్పుడు తుపాకీ మోతలతో దద్దరిళ్లిన ప్రాంతం. నెత్తుటి మరకలతో రక్త చరిత్రను రాసుకున్న ప్రాంతం ఇప్పుడు వేద ఘోషతో పులకించిపోతోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ లో 2004 లో త్రిదండి చిన్న జీయర్ స్వామి సంకల్పంతో ఆదివాసీ గిరిజనుల చెంతకు చేరింది ఉన్నతమైన విద్య. గోండి , లంబాడా , కోయ , కోలం ఇలా అనేక మాతృబాషలతో ఇక్కడికి చేరుతున్న విద్యార్థులు ప్రపంచాన్ని శాసించే ఇంగ్లీష్ బాషలో చురకత్తుల్లా రాటుదేలుతున్నారు. అల్లంపల్లి గురుకులం రాకతో తండాలకు మహర్దశ పట్టినట్టైంది. రహదారి లేక.. రాకపోకలు సాగించే మార్గం కనిపించక.. అగమ్యగోచరంగా సాగిన అల్లంపల్లి పరిసరప్రాంతాల గిరిజన గూడాలకు అల్లంపల్లి గురుకులం కొత్త బాటలు వేసింది. అల్లంపల్లి ఏజెన్సీ గిరిజనులు జీయర్ గురుకులంలో విద్య నభ్యసిస్తూ కార్పోరేట్ విద్యార్థులతో పోటిపడి సత్తా చాటుతున్నారు. బతుకు బండి సాగించడమే కష్టమైన ఆదివాసీలకు కార్పోరేట్ స్థాయిలో ఇంగ్లీషు చదువులను దగ్గర చేసింది అల్లంపల్లి జీయర్ గురుకులం. ఇక్కడ విద్య ఉచితం , మద్యాహ్న భోజనం ఉచితం.. ఉండేందుకు చక్కని హాస్టల్ సదుపాయం.. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా డిజిటల్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. పరిమితంగా అడ్మిషన్లు ఉండటంతో ఇక్కడ సీట్ దొరికితే తమ బతుకులు మారి పోతాయని బావిస్తారు ఆదివాసీ గిరిజనులు. ఈ విద్యాలయంలో నర్సరీ నుండి పదవ తరగతి వరకు ఉచితంగా విద్య కొనసాగుతుంది. ఇంగ్లీష్ బాషతో పాటు మాతృబాషలోను బోధన కొనసాగుతుంది. సంస్కృతి సంప్రదాయాలు.. క్రమశిక్షణ.. గిరిజన కట్టుబాట్లు, గురువులపై భక్తి‌బావన ఇక్కడి విద్యార్థుల్లో‌ కనిపిస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...