Viral Video: రైలుకు ఎదురుగా దూసుకొస్తున్న ఏనుగు.. చివరికి ఏమైందంటే..?? వీడియో

Viral Video: రైలుకు ఎదురుగా దూసుకొస్తున్న ఏనుగు.. చివరికి ఏమైందంటే..?? వీడియో

Phani CH

|

Updated on: Aug 29, 2021 | 6:26 PM

టెక్నాలజీ అభివృద్ధిచెందిన తర్వాత ఏ మూలన ఏం జరిగినా ఇట్టే ప్రపంచమంతా తెలిసిపోతుంది. ప్రపంచం నలుమూలలా జరుగుతున్న సంఘటనలు ఎన్నో నిత్యం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

టెక్నాలజీ అభివృద్ధిచెందిన తర్వాత ఏ మూలన ఏం జరిగినా ఇట్టే ప్రపంచమంతా తెలిసిపోతుంది. ప్రపంచం నలుమూలలా జరుగుతున్న సంఘటనలు ఎన్నో నిత్యం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఉత్తర బెంగాల్‌లో జరిగిన ఓ సంఘటన నెట్టింట వైరల్‌గా మారడమే కాదు.. నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. రైల్వే ట్రాక్‌ దాటుతున్న ఓ ఏనుగు ప్రాణాలను కాపాడారు ఇద్దరు రైలు డ్రైవర్లు. ఉత్తర బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలోని నాగరకత-చల్సా ప్రాంతాలమధ్య ఈ సంఘటన జరిగింది. ఇక్కడ ఒక ఏనుగు రైల్వే ట్రాక్‌ దాటే ప్రయత్నంలో ట్రాక్‌కు దగ్గరగా నడుస్తోంది. అది గమనించిన డ్రైవర్లు అప్రమత్తమై సకాలంలో బ్రేకులు వేయడంతో ఏనుగు బతికి బయటపడింది. ట్రైన్‌ స్లో అవడం చూసిన ఏనుగు అక్కడినుంచి అడవిలోకి వెళ్ళిపోయింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: YS Jagan: హాలిడే ట్రిప్ కి వెళ్లిన సీఎం.. సిమ్లా చేరుకున్న జగన్ దంపతులు.. వీడియో

Samantha: పేరు మార్చుకోవడం నా ఇష్టం.. ట్రోలర్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన సామ్‌.. వీడియో

Published on: Aug 29, 2021 06:26 PM