Traffic police: ఈ పోలీసన్న తెగువకు సలాం చెప్పాల్సిందే.. టవర్‌పైకెక్కి పక్షిని రక్షించిన ట్రాఫిక్ పోలీసు
సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తారు? వాహనదారులను రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలను సక్రమంగా పాటించేలా చూస్తుంటారు. అలాగే నిబంధనలను అతిక్రమిస్తున్న వారికి జరిమానాలు, శిక్షలు వేస్తుంటారు.
బెంగళూరులోని రాజాజీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సురేష్ తన ప్రాణాలను పణంగా పెట్టి మొబైల్ టవర్‌పై ఇరుక్కుపోయిన పక్షిని రక్షించాడు. ఈ వీడియోను బెంగళూరులోని వెస్ట్ ట్రాఫిక్ డివిజన్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ కులదీప్ కుమార్ ఆర్ జైన్ ట్విట్టర్‌లో షేర్ చేయగా క్షణాల్లోనే వైరల్‌గా మారింది. సురేశ్‌ను ప్రశంసిస్తూ లక్షలాది లైకులు, కామెంట్లు వెల్లువెత్తాయి. ఇక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర కూడా ఇదే వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ, ‘మా ట్రాఫిక్ పోలీసులు కూడా రెస్క్యూ పనిలో పాల్గొంటున్నారు. టవర్‌లో ఇరుక్కుపోయిన కాకిని రాజాజీనగర్ ట్రాఫిక్ పోలీస్ సురేశ్ ఎంతో శ్రద్ధతో రక్షించారు. అతని సమయస్ఫూర్తికి, అంకిత భావానికి అభినందనలు’ అని ప్రశంసలు తెలిపారు. అలాగే మాజీ మంత్రి సురేష్ కుమార్ కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ వీడియోను షేర్ చేయగా సురేష్ ధైర్యాన్ని, నిస్వార్థతను నెటిజన్లు కొనియాడుతుండగా, మరికొందరు మాత్రం భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. అలాగే ఆయనకు తగిన అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించాలంటూ నెటిజన్లు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..