Black Magic: అమ్మో..! ఇవేం క్షుద్రపూజలు.. ముగ్గు వేసి.. ఏకంగా మనిషి పుర్రెను పెట్టి.. వీడియో.
క్షుద్రపూజలు మహబూబాబాద్ జిల్లా జిల్లాను వణికిస్తున్నాయి. నిత్యం ఎక్కడో చోట ఇలాంటివి దర్శనమిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా డోర్నకల్ బాపూజీనగర్ కాలనీలోని ఓ స్థలంలో క్షుద్రపూజలు చేసిన
తాజాగా డోర్నకల్ బాపూజీనగర్ కాలనీలోని ఓ స్థలంలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు గుర్తించిన స్థానికులు భయంతో వణికిపోయారు. మనిషి పుర్రె, నిమ్మకాయలు, పసుపు కుంకుమలు చూసి కంగారుపడ్డారు. క్షుద్రపూజలు ఎవరు.. ఎందుకు చేశారో తెలియక…స్ధలం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అమావాస్య పౌర్ణమి వేళల్లో ఇలాంటి విపరీతంగా జరుగుతుంటాయి. ఆదివారం అమావాస్య వచ్చిందంటే ఇలాంటి క్షుద్ర పూజలు కోకొల్లలు. కొందరు ఇళ్ళ ముందే ఇలాంటి పూజలు చేసి ఆ ఇంటి యజమానులను మానసికంగా ఇబ్బంది పెడుతుంటారు. మహబూబాబాద్ జిల్లాలో తరచుగా జరుగుతున్న క్షుద్రపూజలపై జన విజ్ఞాన వేదిక మండిపడింది. అమాయక ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇలాంటివి చేస్తున్నారని ఎవరు భయపడొద్దని సూచిస్తున్నారు. ఈ పూజలతో ఎవరికీ ఎలాంటి హాని జరగదని భరోసా ఇస్తున్నారు జనవిజ్ఞాన వేదిక నేతలు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..