Crab - Falcon: ఎటాక్ చెయ్యడానికి వచ్చిన గద్దకే చుక్కలు చూపించిన పీత.. వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో..

Crab – Falcon: ఎటాక్ చెయ్యడానికి వచ్చిన గద్దకే చుక్కలు చూపించిన పీత.. వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో..

Anil kumar poka

|

Updated on: Jan 13, 2023 | 9:53 PM

గద్ద చాలా ఎత్తులో ఎగిరే పక్షి. అంత ఎత్తునుంచి కూడా భూమిమీద ఉండే ఎంత చిన్న ఎరనైనా గుర్తించడం దీని ప్రత్యేకత. అంతేకాదు. దాని కంట పడగానే


గద్ద చాలా ఎత్తులో ఎగిరే పక్షి. అంత ఎత్తునుంచి కూడా భూమిమీద ఉండే ఎంత చిన్న ఎరనైనా గుర్తించడం దీని ప్రత్యేకత. అంతేకాదు. దాని కంట పడగానే వాయువేగంతో కిందకు వచ్చి, దాన్ని తన్నుకుపోతుంది. అలాంటి ఈ గద్దకు నీటిలో ఉన్న రాయిపైన చిన్న పీత కనిపించింది. అంతే దాన్ని తన ఆహారంగా చేసుకుందామని తిన్నగా ఆ రాయిపైన వచ్చి వాలింది. అంతే ఆపీతను గుటుక్కున మింగేద్దామనుకుని లటుక్కున ముక్కుతో పట్టుకుంది. కానీ, ఆ పీత ఊహించని విధంగా గద్దపై రివర్స్ అటాక్ చేసింది. గద్ద అలా ముక్కుతో పట్టుకుందో లేదో.. తన పదునైనా కాళ్లతో దాని ముఖంపై దాడి చేసింది. ఎండ్రకాయ దెబ్బకు నీటిలో పడిన గద్ద విలవిల్లాడింది. ఎలాగోలా ఆ ఎండ్రకాయను వదిలించుకుంది. బతుకు జీవుడా అంటూ అక్కడినుంచి తుర్రున ఎగిరిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ యూజర్‌ ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్‌ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది. ఎవరి సమస్యలకు వారే కారణం అవుతారంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తమదైన స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 13, 2023 09:53 PM