Viral Video: ఒక్క చేత్తో పావ్భాజి చేస్తూ .. హార్ట్ టచ్ చేస్తున్న వ్యాపారి.. వైరల్ అవుతున్న వీడియో..
ముంబైలో ఓ వ్యాపారి పావ్ భాజీ స్టాల్ నడుపుతున్నాడు. చాలా మంది ఎంతో ఇష్టంగా ఆయన దగ్గరకు వచ్చి పావ్ భాజీ తింటారు. ఎందుకంటే... వాళ్లందరికీ అతను ఇన్స్పిరేషన్. యూత్‌కి అతను మోటివేషన్. అతనికి సంబంధించిన వీడియోని IAS ఆఫీసర్ సోనాల్ గోయల్ ట్విట్టర్లో షేర్ చేశారు.
ముంబైలో ఓ వ్యాపారి పావ్ భాజీ స్టాల్ నడుపుతున్నాడు. చాలా మంది ఎంతో ఇష్టంగా ఆయన దగ్గరకు వచ్చి పావ్ భాజీ తింటారు. ఎందుకంటే… వాళ్లందరికీ అతను ఇన్స్పిరేషన్. యూత్‌కి అతను మోటివేషన్. అతనికి సంబంధించిన వీడియోని IAS ఆఫీసర్ సోనాల్ గోయల్ ట్విట్టర్లో షేర్ చేశారు. “మితేష్ గుప్తా కొన్నాళ్ల కిందట దురదృష్టవశాత్తూ తన చెయ్యిని కోల్పోయారు. అయినప్పటికీ పావ్ భాజీ స్టాల్‌ని తన గట్స్‌తో నిర్వహిస్తున్నారు” అని ఆమె క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటివరకూ వీడియోను 37 వేల మందికి పైగా చూశారు. ప్రమాదంలో చెయ్యిని కోల్పోయినా.. రోజూ స్వయంగా కూరగాయలను ఒక చేత్తోనే కట్ చేసి… ఒక చేత్తోనే పావ్ భాజీలు తయారుచేస్తున్నాడు మితేష్. ఆయన పట్టుదల, నిబద్ధత చూసి స్థానికులు ఆయన్ని ప్రేరణగా తీసుకుంటున్నారు. “ఆయన దివ్యాంగుడు కాదు… అన్ని అవయవాలూ ఉండి… ఏ పనీ చెయ్యని వారే అసలైన దివ్యాంగులు” అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. “నిజంగా చాలా ప్రేరణ కలిగిస్తున్నాడు. హార్ట్ టచ్ చేశాడు” అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా… “చాలా ప్రేరణాత్మక కథ” అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!
killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..